Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Journalists atack : జర్నలిస్టు శివారెడ్డిపై కేసును తక్షణ మే ఉపసంహరించుకోవాలి

--రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారా యణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ 

జర్నలిస్టు శివారెడ్డిపై కేసును తక్షణ మే ఉపసంహరించుకోవాలి

–రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ 

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మీడియా సంస్థ లు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంరాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు అభిప్రాయపడ్డారు. వార్తలు రాసే, ప్రసారం చేసే జర్నలిస్టు లపై ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు కేసులు పెట్టించడం సరైంది కాద ని, ప్రసార మైన వార్త పట్ల ఏవైనా సందేహాలు ఉన్న, తప్పుడు వార్త గా భావిస్తే ఖండించాలి తప్ప పోలీస్ కేసులు పెట్ట డం ఎంత మాత్రం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.

ఈ మధ్యకా లంలో అనేక చోట్ల జర్నలిస్టులపై ఈ తరహా కేసులు న మోదవడం పట్ల తెలంగాణ జర్నలిస్టు సమాజం ఆందోళన చెందు తుందని, తా జాగా సీనియర్ జర్నలిస్టు శివారెడ్డి పై ములుగు జిల్లా లో కేసు నమోదు కావడాన్ని టి యు డబ్ల్యూ జే తీవ్రంగా ఖండిస్తు న్నది.

సిగ్నల్ టివి జర్న లిస్టు శివారెడ్డి పై ములుగు జిల్లా పస్రా పోలీసు స్టేషన్ లో నమోదైన కేసు ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని తెలంగాణ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ (temju ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, ఎ.రమణ కు మార్ లు డిమాండ్ చేశారు.ఇక ముందు కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు న్నాము.

Journalists atack