–ఆన్‌లైన్‌లో బస్ పాస్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
Journalists bus pass: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల (Journalists bus pass) గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation)(టీజీఎస్‌ఆర్టీసీ) పొడిగించింది. ప్రస్తుత బస్ పాస్‌ల (bus pass) గడువు ఈ నెల 30తో ముగుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సెప్టెం బర్ 30 వరకు మూడు నెలల పా టు జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల (Accreditation cards of journalists)కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగా ణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినందున ఈ మేరకు బస్ పాస్‌ల గడువును మూడు నెలల పాటు టీజీఎస్‌ఆర్టీసీ పొడిగించింది.
అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ (Accreditation cards of journalists) బస్ పాసుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారం భమైంది. కాలపరిమితి పొడిగించి న ఈ బస్ పాస్‌లను గతంలో మాదిరిగానే https: //tgsrtc pa ss.com/journalist.do?cate gory=Fresh లింక్ పై క్లిక్ చేసి దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దర ఖాస్తుల్లో జర్నలిస్టుల వ్యక్తిగత వివ రాలను నమోదు చేయడంతో పా టు ఫొటో, అక్రిడిటేషన్ కార్డులను విధిగా అప్‌లోడ్ చేయాలి. బస్ పాస్ కలెక్షన్ సెంటర్‌నూ ఎంపిక చేసుకోవాలి. ఈ దరఖాస్తులను సమాచార, పౌరసంబంధాల శాఖ ఆన్ లైన్ లో (online) దృవీకరించిన తర్వాత జర్నలిస్టులకు బస్ పాస్‌లను టీజీ ఎస్‌ఆర్టీసీ జారీ చేస్తుందని టీజీఎస్ ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.