Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Judge Roja Ramani : సంచలన తీర్పు, హత్య కేసులో యావజ్జీవ శిక్ష

–నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ రెండో అదనపు జడ్జి రోజా రమణి తీర్పు

Judge Roja Ramani : ప్రజాదీవెన, నల్లగొండ క్రైం: యాదాద్రి భువనగిరి జిల్లా తుంగ తుర్తి నియోజవకర్గ పరిధిలోని అడ్డ గూడురు మండలంలో జరిగిన హ త్యకేసులోనల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ, జిల్లా రెండో అదనపు జడ్జి రోజా రమణి మంగళవారం 17 మందికి జీవిత ఖైదీ విధిస్తూ సం చలన తీర్పు వెలువరించారు. శిక్ష పడిన వారిలో ఓ మాజీ సర్పంచ్ ఉన్నారు. 2017లో పాత కక్షల నేపథ్యంలో అడ్డగూడూరు మండ లం హజీంపేటలో ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తిని 201 7లో 18మంది కలిసి హత్యచే శారు. అప్పటినుంచి కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నది. కాగా మంగళ వారం కేసు ఫైనల్ కు వచ్చింది.

నిందితుల్లో ఓ వ్యక్తి అప్పటికే మరిణించారు. పూర్తి సాక్షదారా లను పోలీసులు కోర్టులో ప్రేవేశ పెట్టగా కేసు పూర్వాపరాలు పరిశీ లించి న్యాయమూర్తి రోజారమణి, 17 మందికి యావజ్జీవ కారాగారా శిక్ష విధించారు. జడ్జిమెంట్ అనం తరం దోషులు, వారికోసం వచ్చిన కుటుంబసభ్యుల రోదనలతో కోర్టు ఆవరణలో దద్దరిల్లిపోయింది. నల్ల గొండ ట్రాఫిక్ సీఐ రాజు, మహిళ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ కఠిన బందోబస్తు ఏర్పాటు మధ్య, దోషు లను జైలుకు పంపించారు.