ప్రజా దీవెన, కోదాడ: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నా కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. శనివారం కోదాడ కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయన పాల్గొని మాట్లాడారు. లోక్ అదాలత్ తో కక్షిదారులకు డబ్బు,సమయం ఆదా అవుతాయి అన్నారు.రాజీ మార్గమే రాజ మార్గమని కక్షలు పట్టింపులకు పోయి కక్షి దారులు నష్ట పోవద్దని సూచించారు. ఈ సందర్భంగా సివిల్, క్రిమినల్ కేసులతోపాటు రాజీ పడదగిన అన్ని కేసులు కోదాడలోని అన్ని కోర్టులలో 2,132 కేసులు లోకాదాలత్ లో పరిష్కరించినట్లు తెలిపారు. 10 లక్షల రూపాయలు అపరాధ రుసుం వచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ , బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి లోక్ అదాలత్ సభ్యులు పద్మ, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి,న్యాయవాదులు పాలేటి నాగేశ్వరరావు,తమ్మినేని హనుమంతరావు, రంగారావు, శరత్ బాబు, యశ్వంత్, మురళి, ఉయ్యాల నరసయ్య, శాస్త్రి, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.