Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jupalli Krishna Rao: నాణ్య‌మైన విద్య‌, భోజ‌నం అందించాలి

–అల‌స‌త్వం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
–పెంట్ల‌వెల్లి లాంటి ఘ‌ట‌న‌లు పున‌ రావృతం కాకుండా చూడాలి
–రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

Jupalli Krishna Rao: ప్రజా దీవెన, కొల్లాపూర్: కేజీబీవీ పాఠ‌శాలల్లో చ‌దువుతున్న విద్యా ర్థులకు నాణ్య‌మైన విద్య‌తో పాటు భోజనం అందించాల‌ని, అలస త్వం వహిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఎక్సైజ్, ప‌ర్యాట‌క, సాం స్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణా రావు (Jupalli Krishna Rao) హెచ్చరించారు. పెంట్ల‌వెల్లి కేజీబీవీలో క‌లుషిత ఆహారం – విద్యార్థినిల‌కు అస్వ‌స్త ఘ‌ట‌న‌ను మంత్రి జూప‌ల్లి సీరియ‌స్ గా తీసుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సోమ‌వారం కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ ఫంక్ష‌న్ హాల్ లో కేజీబీవీ పాఠ‌శాల‌ల విద్యా ర్థినులు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బం దికి అవ‌గాహ‌న స‌దస్సులో మంత్రి జూప‌ల్లి (Jupalli Krishna Rao)పాల్గొని దిశానిర్ధేశం చేశా రు. భ‌విష్య‌త్ లో ఇలాంటి ఘ‌ట‌న‌ లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లేక‌పోతే సంబంధిత అధికారులు, బియ్యం, ప‌ప్పులు, ఇత‌ర వంట సామాగ్రిని, కూర‌గాయాలు స‌ర‌ఫ‌రా చేసే అధికారులు, ఎజెన్సీల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. విద్యార్థినుల‌కు కేవలం తరగతి పాఠాలే కాక వ్యక్తిత్వ వికాసం నేర్పించ‌డం, ఆటలు, ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌లో ప్రోత్సహించాల‌ని.

వారిపై ఎలాంటి ఒత్తిడి ప్రభావం లేకుండా తీర్చిదిద్దాల‌ని, ప్రతి విద్యా ర్థినిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకో వాల‌ని సూచించారు. ఇంట్లో పిల్లలను ఎలాగైతే శ్రద్ధగా చూ సుకుంటామో ఇక్కడ ఉన్న పిల్ల లను కూడా మీ పిల్లలుగా భావించి అంతే జాగ్రత్తగా చూసు కోవాలని సూచించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం శుచి అయిన పౌష్ఠిక ఆహారం అందిం చాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల (Seasonal diseases) కాలం పరిస రాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్య లు తీసుకోవాలని, ప్రభుత్వం విద్యా ర్థినిలకు నాణ్య మైన విద్య, వసతి, పౌష్ఠిక ఆహారం అందిస్తోందని, విద్యార్థినిల విద్యా ఆరోగ్యం పట్ల రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గ అభి వృద్ధికి విని యోగించే నిధుల‌ను పాఠ‌ శాల‌లు, హ‌స్ట‌ల్స్ లో మెరుగైన సౌక‌ర్యాల కోసం కేటాయిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి తెలిపారు. క‌లుషిత నీరు, పురుగుల బియ్యం, కుల్లిపోయిన కూర‌గాయాలు స‌ప్లై చేసే ఎజెన్సీల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోరు అని అధికారుల‌పై ఆగ్రహాం వ్య‌క్తం చేశారు. తాగునీటిని శుద్ధి చేయాల‌ని, టెస్టింగ్ మిష‌న్ ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

అవ‌స‌ర‌మైన చోట త్వ‌ర‌లోనే ఆర్వో ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. వసతి గృహంలో సౌక ర్యాలపై మంత్రి జూప‌ల్లి విద్యార్థు లను అడిగి తెలుసుకున్నారు. సుర క్షిత మంచి నీళ్ళు వస్తున్నాయా లైబ్ర‌రీలో పుస్త‌కాలు అందుబాటులో ఉంటున్నాయా అని ఆరా తీశారు. విద్యార్థులు ల‌క్ష్యానుగుణంగా విద్య‌ను అభ్య‌సించాల‌ని, ఆలోచ‌న తీరు కూడా గొప్ప‌గా ఉండాల‌ని.. అప్పుడే ఉన్న‌త స్థానాల‌కు చేరుకునే అవ‌కాశం ల‌భిస్తుందని మార్గ‌నిర్ధేశం చేశారు. చ‌దువుకు వ‌య‌సుతో సంబంధం లేద‌ని, అది నిరంత‌ర ప్ర‌క్రియ అని, స‌మాజంలో ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డే విధంగా విద్య‌ను అభ్య‌సించి ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని హిత‌బోధ చేశారు. కేజీబీవీల్లో ఏమైనా స‌మ‌స్య ఉంటే నేరుగా త‌న‌కు గాని, క‌లెక్ట‌ర్ కు కానీ ఫోన్ చేయాల‌ని చెప్పి త‌న నంబ‌ర్ ను విద్యార్థుల‌కు ఇచ్చారు. ఈ కార్య‌ క్ర‌మంలో క‌లెక్ట‌ర్ బ‌దావ‌త్ సంతోష్ , విద్యా శాఖ అధికారులు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బంది పాల్గొన్నారు.