Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jurisprudence Conference: భువనగిరిలో న్యాయ విజ్ఞాన సదస్సు

Jurisprudence Conference: ప్రజా దీవెన, భువనగిరి టౌన్: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ (Telangana State Law Service Authority) జారీచేసిన కార్యా చరణ ప్రకారంజిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరా జు ఆదేశాల మేరకు, ఇంచార్జ్ కార్య దర్శి వి. మాధవి లత సూచనల ప్రకారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, యాదాద్రి భువనగిరి, జిల్లా సంక్షేమ శాఖ, సీనియర్ సిటిజన్స్ ట్రిభ్యునల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా న్యాయ విజ్ఞాన సదస్సును ఆర్. డి. ఒ కార్యాలయ ములో నిర్వహించడం జరిగింది.

ఈ సదస్సులో సీనియర్ సిటిజన్స్ ట్రిభ్యునల్ చైర్మన్ పి. అమరేందర్, ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారిణి ఎస్. శైలజ , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ట్రిభ్యునల్ సభ్యులు బాలేశ్వర్, దశరథ, జె. అంజయ్య, వెంకటేష్, బాలయ్య, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి మరియు సభ్యులు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ రెడ్డి (Senior Citizens Tribunal Chairman P. Amarender, Incharge District Welfare Officer S. Sailaja, Special Deputy Collector, Tribunal members Baleshwar, Dasharatha, J. Anjaiah, Venkatesh, Balaiah, Pensioners Association President Mohan Reddy and Members, Senior Citizens Welfare Association President Shankar Reddy) మరియు సభ్యులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. కార్యాక్ర మములో రెవెన్యూ డివిజనల్ అధికారి పి.అమరేందర్ మాట్లాడు తూ భువనగిరిలో సీనియర్ సిటిజ న్స్ ట్రిభ్యునల్ సభ్యుల సహకారం తో ప్రభావవంతంగా వయోవృద్ధ పౌరుల నిర్వహణ, రక్షణ , సంక్షేమ చట్టం – 2007 అనుసరించి వయో వృద్దుల వ్యాజ్యాలను పరిష్క రిస్తు న్నామని, చట్టం యొక్క లక్ష్యాలు నెరవేర్చుటలో కేవలం ట్రిభ్యునల్ మాత్రమే కాకుండా వారి సంక్షేమా నికి వెల్ఫేర్ అసోసియేషనులు కూ డా వారి నిస్వార్థ సేవలు అందిస్తు న్నారని, జిల్లాలో వయో వృద్ధుల ఆశ్రమాలు కూడా తమ వంతు సేవలు అందిస్తున్నారని తెలిపి తల్లి తండ్రులు తమ పిల్లలు పోషించట్లే దని మరియు ప్రేమ, మమకారం ఒక భరోసాతో తమ ఆస్తులను వారి సంతానానికి ఇచ్చి, వారి ఆదరణ లేక తిరిగి ట్రిభ్యునల్ ను ఆశ్రయించి మా ఆస్తులు మాకు ఇప్పించి న్యా యం చేయండి అని రావటం అత్యం త బాధాకరమని తెలిపి, వయో వృద్దులు తమ కోసం కొంత ఆస్తిని లేదా డబ్బులను ఉంచుకో వాలని తెలిపారు.

కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారిని ఎస్. శైలజ (SAILAJA) మాట్లాడుతూ వయో వృద్ధుల సంక్షేమానికై తమ శాఖ పరిదిలమేరకు సేవలు అందిస్తు న్నామని తెలిపారు. స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ జయశ్రీ మాట్లాడుతూ తల్లి తండ్రులను చూసే బాధ్యత పిల్లలదేనని, సంక్షేమ సంఘాల ద్వారా వయో వృద్ధులపై ఆధరణ, పోషణా బాధ్యత, చట్టం వంటి అంశాలపై ప్రభుత్వ శాఖలతో అను సంధానమై చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. భువనగిరి న్యాయ వాదుల సంఘం అధ్య క్షులు బి. హరినాథ్ మాట్లాడుతూ వయో వృద్దులు ఏదైనా ఆస్తిని తమ సంతానానికి అప్పచెప్పే సమ యములో తగు న్యాయ సలహా తీసుకువాలని, ప్యానల్ న్యాయ వాదులు తమ న్యాయ సేవలు, ఉచి త సలహాలు అందచేయ టాని కి న్యాయ సేవ సంస్థ ( legal service organization) ద్వారా సేవలు అందిస్తారని, వయో వృద్ధుల ఆశ్రమా లకు వయో భారంతో ఉన్న తల్లి తండ్రులు రాకుండా ఉన్నప్పు డే కుటుంబ వ్యవస్థకు సరైన పర మార్థం చేకూరుతుందని తెలిపారు.

భువనగిరి న్యాయ సహాయ కేంద్రం డిప్యూటి న్యాయ సహాయ న్యాయ (Central Deputy Legal Assistant Legal) వాది జి. శంకర్ మాట్లాడుతూ వ యో వృద్ధులకోసం జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యాయ సేవల పథకాన్ని రూపొందించిందని ఈ పథకముతో వయో వృద్దులకు న్యాయ సేవలు అందుతాయని, ప్రతీ నెల వయో వృద్ధుల ఆశ్రమాలు న్యాయ సేవ సంస్థ న్యాయమూర్తి సందర్శించి, ఆశ్రమములో ఏవేని నిర్వహణ లోపాలు ఉన్నట్లయితే సంబంధిత శాఖ ద్వారా తగు చర్యలు తీసుకుంటుందని, ఎవరైనా న్యాయ సేవలకు తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. ట్రిభ్యునల్ సభ్యులు, వయో వృద్ధుల సంక్షేమ సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ చట్టం యొక్క లక్ష్యాలను నెరవేర్చుటలో తమ వంతు సేవలు అందిస్తామని, అక్టోబర్ ఒకటి నుండి వారం రోజులు వయో వృద్ధుల సంక్షేమ, చట్టంపై అవగాహనా కార్యక్రమాలు కేవలం పట్టణాలలోనే కాకుండా గ్రామాలలో కూడా నిర్వహిస్తామని ముక్తకంఠంగా తెలిపారు.