K. Johnny Reddy : వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు అందజేస్తాం ఆర్ ఎం కే. జానీ రెడ్డి
K. Johnny Reddy : ప్రజాదీవెన, నల్గొండ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్గొండ రీజియన్ నందు అన్ని డిపోలలో వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు అందజేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె.జానీ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీజియన్ లో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చున్నారు. ప్రతి కిలోమీటర్ పై గతంలో కంటే రూ.7 తగ్గింపు ఉందని, 6 గంటల వెయిటింగ్ చార్జ్ మినహాయింపు ఉంటుందన్నారు. ప్రైవేట్ వాహనాల కన్నా తక్కువ ధరలకు బస్సులు వస్తాయని, డ్రైవర్ బత్తా కట్టనవసరం లేదని, అనుభవజ్ఞులైన డ్రైవర్లచే, సౌకర్యవంతమైన అధునాతన టెక్నాలజీ ఉన్న కొత్త బస్సులు చెప్పిన చోట నుండి ఎక్కడికైనా ఎన్ని గంటలకైనా అద్దెకు తీసుకోవచ్చని చెప్పారు. బస్సు బుకింగ్ చేసుకోవడానికి సమీప డిపోలను సంప్రదించాలని తెలిపారు.
వివరాలకు నల్గొండ: 9959844918, సూర్యాపేట:7989225791, మిర్యాలగూడ:7382833790, కోదాడ:7780433533, దేవరకొండ:7382833031, యాదగిరిగుట్ట:9885103165, నార్కెట్ పల్లి :9848584198.