K. Praveen Reddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :ప్రస్తుతమున్న సంక్షోభ సందర్భంలో ప్రపంచశాంతిని కాపాడాలని నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకులు కె .ప్రవీణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగార్జున ప్రభుత్వ కళాశాల, చరిత్ర విభాగంలో ఆయన విస్తృతోపాన్యాసం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి అంగాలు , విజయాలు మరియు ప్రపంచ శాంతిని కాపాడుటలో ఐక్యరాజ్య సమితి పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో యుద్దవాతావరణాన్ని తొలగించి శాంతి కోసం కృషి చెయ్యడానికి మూల స్తంభం ఉన్న భారతదేశానికి భద్రతామండలి శాశ్వత సభ్యత్వం కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతిలో ఐక్యరాజ్య సమితి పాత్రను ఉదాహరణలతో విద్యార్థులకు తెలియజేశారు.
ఐక్యరాజ్య సమితి విజయానికి మరియు ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత దేశం కీలకపాత్ర పోషిస్తన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో చరిత్ర విభాగం అధ్యక్షులు డా. భట్టు కిరీటం, ఉపన్యాసకులు యన్ కోటయ్య, డా. ఆదే మల్లేశం, ఇతర అధ్యాపకులు చంద్రయ్య, హాబీబ్, డా.అంకూస్ , జె.దినేష్ , యమ్.వెంకటరెడ్డి , షేక్ హాస్రత్ బేగం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.