K. Sivaram Reddy D.Y.S.P : మోటార్ ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు కె. శివరాం రెడ్డి డి.యస్.పి
K. Sivaram Reddy D.Y.S.P : ప్రజాదీవెన, నల్గొండ : నల్లగొండ జిల్లాలో వ్యవసాయ భూముల వద్ద దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో యస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. అందులో బాగంగా ఉదయం సుమారు 10 గంటల ప్రాంతములో పక్కా సమాచారముతో నార్కెట్ పల్లి పోలీసు వారు నార్కెట్ పల్లి బస్ స్టాండ్ వద్దకి చేరుకోకగా అక్కడ అనుమానాస్పదంగా వున్న లావుడ్య తిరుమలేష్ ని ఆపి తనని విచారించగా లావుడ్య తిరుమలేష్ ప్రస్తుత నివాసం బంజారా కాలనీ, హయాత్ నగర్, రంగా రెడ్డి జిల్లా తనకి హైదరాబాద్ లో ని బొమ్మల గుడి వద్ద సైదా మరియు శ్రీను పరిచయం అయినారు. లావుడ్య తిరుమలేష్ మరియు తన స్నేహితులు అయిన సైదా మరియు శ్రీను అను వారు పట్ట పగలు రక్కి చేసి వ్యవసాయ భూముల వద్ద ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడినాడని తెలిపినాడు.
లావుడ్య తిరుమలేష్ మరియు తన స్నేహితులు అయిన సైదా మరియు శ్రీను అను వారు నార్కెట్ పల్లి నుండి ఏనుగులదొరి వెళ్ళు దారి లో నార్కెట్ పల్లి గ్రామ శివారులో సామ కొండల్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద మోటార్ బోర్ వైర్ ని కట్ చేసి చోరికి చేయడానికి ప్రయత్నించినాడు. పైన పట్టుబడిన నేరస్థడు అయిన లావుడ్య తిరుమలేష్ చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో తాను అనుకున్న పథకం ప్రకారముగా వ్యవసాయ భూముల వద్ద ఎలెక్ట్రికల్ వైర్ చోరీలకు పాల్పడుతున్నాడు.
ఇట్టి నేరస్తులను పట్టుకోవడములో నల్గొండ డి.ఎస్.పి.కె.శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్ పల్లి, సీఐ నాగరాజు ఆద్వర్యములో నార్కెట్ పల్లి ఎస్ ఐ డి.క్రాంతి కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ రాము, మరియు కానిస్టేబుల్ శివ శంకర్, గిరిబాబు, తిరుమల్, సత్యానారాయణ, అఖిల్, మహేశ్, సాయి కుమార్ మరియు ఇతర సిబ్బంది సహకారముతో నేరస్థుడిని పట్టుకోవడము జరిగినది. ఇట్టి నేరస్థుడిని పట్టుకోవడములో ప్రతిభ కనభర్చిన సిబ్బందిని జిల్లా ఎస్పి ప్రత్యేకముగా అభినంధిచినారు.