విజేతలకు నగదు పారితోషకంతో పాటు షీల్డ్ల బహుకరణ కె శివరాం రెడ్డి నల్గొండ డిఎస్పి
K Sivaram Reddy DSP : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మిషన్ పరివర్తన్- యువతేజం లో భాగంగా పిలుపునిచ్చిన కబడ్డీ పోటీలు నల్గొండ సబ్ డివిజన్ స్థాయిలో హట్టహాసంగా మొదలుపెట్టిన కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీలలో మొదటి స్థానం గెలుపొందిన శాలిగౌరారం, రెండవ స్థానం పొందిన నల్గొండ రూరల్ మరియు మూడవ స్థానం కేతేపల్లి లకు చెందిన క్రీడాకారులను నల్గొండ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి నగదు ప్రోత్సాహకంతో పాటు షీల్డ్లతో సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో డి.ఎస్పి మాట్లాడుతూ, పోటీలలో గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇకనుండి గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకై యువత ముందుకు రావాలని అలాగే ఈ క్రీడల ద్వారా పోలీసులతో గ్రామాలలోని యువతకు మంచి సంబంధాలు నెలకొంటూ, ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే పోలీసు వారికి తెలియజేసే విధంగా ఈ క్రీడలు తోడ్పడతాయని సూచించారు.
అలాగే రానున్న రోజులలో జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నేర నివారణ లో యువతను భాగస్వామ్యం చేస్తామని తెలియజేశారు.క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతాయని, అదే విధంగా క్రీడలను అలవాటుగా చేసుకుంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులను, అనుకోని పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం వస్తుందని, అదేవిధంగా ఓటమిని కూడా కసితో, పట్టుదలతో ప్రయత్నించి గెలుపుకి నాందిగా మలుచుకోగలుగుతారు అని, జట్టుగా కలిసి ఓటమిని జయించే దృఢత్వం పెరుగుతుందని తెలిపారు.
ఇట్టి పోటీలను ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చక్కగా నిర్వహించిన పీఈటీలను, పి.డి లను అభినందించారు.పోటీలను ఆర్గనైజ్ చేసిన నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నల్గొండ టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, ట్రాఫిక్ సిఐ రాజు, ఎస్సైలు విష్ణు, సైదా బాబు, సాయి ప్రశాంత్, సైదులు, శివ కృష్ణ మరియు సిబ్బందిని అభినందించారు.