–TUWJ అధ్యక్షులు కె.విరాహత్ అలీ
K. Virahat Ali : ప్రజా దీవెన హైదరాబాద్:విద్య అనేది మనిషికి కేవలం జ్ఞా నాన్ని మాత్రమే అందిస్తుందని, అయితే జ్ఞానంతో పాటు సంస్కా రాన్ని అందిస్తేనె ఆ విద్యకు సార్థ కత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని ఎస్.యం.ఆర్ ఫంక్షన్ హలులో జ రిగిన త్రివేణి హైస్కూల్ 17వ, వార్షి కోత్సవ కార్యక్రమానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై ప్రసంగించా రు. విద్యార్థులు చదువుల్లో డిగ్రీలు పొందడం ద్వారా సమాజంలో వి ద్యావంతులుగా మాత్రమే గుర్తింపు పొందగలుగుతారని, అదే సంస్కా రంతో కూడిన విద్యను అభ్యసిస్తే సమాజంలో ఉత్తములుగా పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఉం టుందని ఆయన స్పష్టం చేశారు. నేడు రాకెట్ వేగంతో సాంకేతిక రంగం దూసుకెళ్తుండడంతో సమా జం ఎంతో మురిసిపోతుందని, కానీ దాని నుండి సంభవిస్తున్న దుష్పరిణామాలను మాత్రం పసిగట్టక పోవడం విచారకరమ న్నారు. సాంకేతిక రంగ అభివృద్ధిని స్వాగతిస్తూనే, అందులో దాగివు న్న మంచి, చెడులను గుర్తించాల్సి న అవసరం ఎంతైనా ఉందన్నారు.
విద్యార్థులు సమయం విలువను మరచిపోకుండా పొదుపుగా దాని ని వినియోగిస్తూ గమ్యానికి చేరు కోవాలన్నారు. చదువుతో డబ్బు లు సంపాదించాలనో, ఇతరులను అనుకరించాలనో అనే ఆలోచన లతో కాకుండా, జీవితంలో విజ యం సాధించాలనే ఆలోచనతో ముందుకెళ్తేనే లక్ష్యం నెరవేరుతుం దని విరాహత్ అలీ సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంబేద్క ర్ ఓపెన్ యూనివర్సిటీ హిస్టరీ ప్రొ ఫెసర్ శ్రీనివాస్, మండల విద్యాధి కారి గురువా రావు, పాఠశాల చైర్మ న్ గుత్త గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.