— టీయూడబ్ల్యూజె రాష్ట్ర అధ్య క్షులు కె.విరాహత్ అలీ
K. Wirahat Ali : ప్రజా దీవెన, గజ్వేల్:సమాజ జ్ఞా నం, జర్నలిజం విలువల పట్ల అవ గాహన లేకుండా, జర్నలిస్టుల పేరు తో సంచరిస్తూ, దోపిడికి పాల్పడు తూ పవిత్రమైన జర్నలిజం వృత్తికి మచ్చ తెస్తున్న నకిలీ ముఠాలకు తగినరీతిలో బుద్ది చెప్పక తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలి స్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ హెచ్చరించారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన గజ్వేల్ నియోజకవర్గ జర్న లిస్టుల సమావేశం, యూనియ న్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిం చారు. ఇటీవల కాలంలో జర్నలి స్టుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తుల ఆగడాలు మితిమీరి పోతు న్నాయని, ప్రజలను, అధికారు లను బ్లాక్ మెయిల్ చేస్తూ వసూ ళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టి కి వచ్చిందన్నారు.
అలాంటి ముఠా ల కదలికలపై తమ సంఘం కన్నేసి పెట్టిందని, చట్టపరంగా వారికి శిక్ష పడేలా చర్యలు చేపడుతున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేశారు. సుదీర్ఘ సామాజిక చరిత్ర కలిగి ఉన్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ ను స్థాపించి 25యేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా రజతోత్సవాలు జరిపేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు. ప్రధాన సమస్యలైన ఇంటి స్థలాలు, ఇండ్లు, ఆరోగ్య పథకం, అక్రెడిటేషన్ కార్డుల మంజూరీ తదితర సంక్షేమ చర్యల అమలు కోసం ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సురేందర్, మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ, కృష్ణ, జగదీశ్, కిరణ్, మునీర్, యాదగిరి తదితరులు మాట్లాడారు.