Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kaleshwaram project: సబ్ కాంట్రాక్ట్ పనుల్లో నిబంధనలు పాటించారా..!

Kaleshwaram project

Kaleshwaram project: –కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ,అ న్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మిం చాయా
–కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధం గా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్ప గించారా
–మూడు బ్యారేజీల నిర్మాణ పను ల్లో కనీసం 15 మంది సబ్ కాంట్రాక్ట ర్లు ఉన్నారు
–నిర్మాణ సంస్థలను వివరాలు అడిగిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్

Kaleshwaram project: ప్రజా దీవెన, హైదరాబాద్: కాంట్రాక్టులు (contracters) పొందిన నిర్మాణ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాయా, లేక కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిం చారా అంటూ ప్రశ్నల వర్షం కురి పిస్తోoది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్. విచారణలో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణ పనుల్లో కనీసం 15 మంది సబ్ కాంట్రాక్టర్లు పాల్గొన్నట్లు కమిషన్ కు (commission) కొన్ని ఆధా రాలు సమర్పించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ముఖ్యమైన పద విలో ఉన్న ఓ నాయకుడి సమీప బంధువుకు చెందిన ఓ కంపెనీ బ్యారేజీల పనులను కూడా సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంగతి తెలిసిం దే.దీంతో సబ్ కాంట్రాక్టర్ల వివరాల ను సమర్పించాలని బ్యారేజీ నిర్మా ణ సంస్థలను కమిషన్ తాజాగా ఆదేశించింది.

నిర్మాణ సంస్థలు సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సమర్పించ కుంటే గత పదేళ్ల ఆర్థిక నివేదికలను సమర్పించాలని నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశిస్తుంది. నిర్మాణ సం స్థలు అనుమానిత సబ్‌కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించినట్లు ఈ ఆర్థిక నివే దికలు చూపించే అవకాశం ఉంది. నిర్మాణ సంస్థలు ఆర్థిక నివేదికలను కూడా సమర్పించకుంటే, ఆ వివ రాలను కేంద్ర పరిశ్రమల శాఖ నుం చి తీసుకురావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని అప్పటి సీఎం కేసీఆర్‌ (kcr) నిర్ణయం తీసుకున్నారని రిటైర్డ్‌ ఇంజినీర్ల కమిటీ జస్టిస్‌ చంద్రఘో ష్‌కి తెలిపింది.

గోదావరిపై నిర్మించి న ప్రాజెక్టులపై అధ్యయనం చేసేం దుకు ప్రభుత్వం 2015లో రిటైర్డ్ సీఈలు బి.అనంతరాములు, వెంక టరామారావు, ఎస్.చంద్ర మౌళి, రిటైర్డ్ ఎస్ఈలు జి.దామోద ర్ రెడ్డి, ఎం.శ్యాంప్రసాద్ రెడ్డిలతో ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ వాదనలు వినిపించారు. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ బీఆర్‌కేఆర్ (brkr) భవన్‌లోని తన కార్యాలయంలో శ్యాంప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన ఇంజనీర్లు కమిషన్ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను వెల్లడిం చారు.మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మా ణాన్ని వ్యతిరేకిస్తూ నివేదిక ఇస్తే అప్పటి సీఎం కేసీఆర్‌, నీటిపారు దల శాఖ మంత్రి హరీశ్‌రావు (HARISH RAO) తిర స్కరించారని, వాటిపై సంతకం కూడా చేయలేదని వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించామన్నారు. మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడి హెట్టి వద్ద 150-151 మీటర్ల ఎత్తు లో బ్యారేజీ నిర్మించాలని సిఫారసు చేస్తూ అప్పట్లో సమర్పించిన ఈ నివేదిక కాపీని కమిషన్‌కు అందజే శారు. కాగా 27 తర్వాత కేసీఆర్, హరీష్‌లకు ఫోన్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తుంది. తదుపరి దశలో అఫిడవిట్లలో వివిధ వ్యక్తు లు సమర్పించిన సమాచారం ఆధా రంగా బహిరంగ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.