Kaloji Narayana Rao: ప్రజా దీవెన, కోదాడ: పట్టణములోని స్థానిక కె. ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (K.R. R Govt Junior College)లో సోమవారం ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు (Kaloji Narayana Rao) జయంతిని పురస్కరించుకొని “తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ . రమణారెడ్డి(R. Ramana Reddy) ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా కాలోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… తెలుగు మాట్లాడుటకు సంకోచ పడెదవు. సంగతేమిటి రా? అన్య భాషలు నేర్చి ఆంధ్ర రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా…అని తెలుగు భాష పై మమకారం చాటారన్నారు. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలించేదిగా ఉండాలని, కవిత్వం సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన అన్నారు. తను ప్రజల బాధలను, కష్టాలను, కన్నీళ్లను “నా గొడవ” ద్వారా ఇంటి భాషలో చెప్పారని అన్నారు. తెల్లని కాగితంపై నల్లని అక్షర సేద్యం చేస్తూ పరాయి భాష మోజులో కొట్టుకుపోకుండా తెలుగు భాష గొప్పతనం (Telugu language is great)తెలియచెప్పి, నాటి నిజాం నిరంకుశ పాలనపై గన్నులు కూడా చేయలేని పనిని పెన్నుతో చేశాడు. సిరా చుక్కలతో నిప్పుల లాంటి రచనలు చేస్తూ యువతను చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమ సాధనలో అందరూ భాగస్వాములయ్యేలా చేశారని ఆయన అన్నారు. నిరంతరం సమాజంలోని పేదల కష్టాలను తన గొడవగా భావించి అక్షర సేద్యం చేసిన కవిహాలికుడు కాళోజీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి.లక్ష్మయ్య,ఆర్. పిచ్చిరెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, జి. యాదగిరి, మారంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వి.బల భీమారావు, ఆర్.రమేష్ శర్మ,పి.రాజేష్,యం. రత్నకుమారి, బి.రమేష్ బాబు, జి.వెంకట రెడ్డి, పి.తిరుమల, యస్.గోపి కృష్ణ యం.చంద్రశేఖర్, కె.శాంతయ్య, ఆర్. చంద్రశేఖర్ గౌడ్,యస్. వెంకటాచారి, టి.మమత, డి.ఎస్. రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.