Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kalvakuntla Kavitha: నేడు ముగియనున్న కవిత కస్టడీ

–బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో విచారణ
–బెయిల్ రావొచ్చని కుటుంబ స భ్యులు, పార్టీ శ్రేణుల ఆశాభావం

Kalvakuntla Kavitha: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) బెయిల్‌ పిటి షన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో (Delhi Rouse Avenue Court) సోమవారం విచారణ జరగనుంది. బెయిల్‌ పిటిషన్‌తోపాటు సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జి షీట్‌పైనా విచారణ జరగనుంది. కవి త ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో కవితది కీలకపాత్ర అని ఆరోపిస్తూ ఈడీ మార్చి 15న ఆమెను అరెస్టు చేసిం ది. తిహాడ్‌ జైల్లో ఉండగానే ఏప్రిల్‌ 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. నాలుగు నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారు. తొలుత తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరగా న్యా యస్థానం తిరస్కరించింది.

తర్వాత ఈడీ, సీబీఐ (ED, CBI) రెండు కేసుల్లో సాధార ణ బెయిల్‌ ఇవ్వాలని కోరగా కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. ట్రయల్‌ కోర్టు తీర్పును కవిత ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేయగా అక్కడా ప్రతికూల ఫలితమే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్‌ కోర్టులో సీబీ ఐ మధ్యంతర చార్జిషీట్‌ దాఖలు చేసింది. చార్జిషీటే సరిగా లేదని, బెయిల్‌ ఇవ్వాలని మరోసారి కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే వాదనలు జరగ్గా, సోమ వారం మళ్లీ విచారణ జరగనుంది. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నా యంటూ కవిత గతంలోనే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ట్రయల్‌ కోర్టుతోపాటు హైకోర్టులోనే నిరాశే మిగిలింది. ఇక తిహాడ్‌ జైల్లో ఉన్న కవిత సుమారు పది రోజులు గా అనారోగ్యంతో ఇబ్బంది పడుతు న్నారు. గత మంగళవారం అస్వస్థ తకు గురికావడంతో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆస్పత్రికి తరలించా రు. సీబీఐ కేసులో గురువారంతో జ్యుడీషియల్‌ కస్టడీ (Judicial Custody)ముగియడంతో వర్చువల్‌ విధానంలో కవితను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచా రు. జైల్లో వైద్య సిబ్బంది సరిగా లేరని, తనకు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సకు అనుమతి ఇవ్వాలని కవిత కోరగా, జడ్జి అనుమతి ఇచ్చారు. శుక్రవారం ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిం చారు. ఆ రిపోర్టులను కోర్టుకు సమర్పించనున్నారు. సోమవారం తో ఆమె జ్యుడీషియల్‌ కస్టడీ ముగి యనుంది. అనారోగ్య సమస్యల నేపథ్యంలో కవితకు బెయిల్‌ వస్తుందా, లేదా అనేది వేచి చూ డాల్సిందే.