Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kalyan Chakraborty:వైద్యులు మరియు వైద్య సిబ్బంది పై దాడులు సరికాదు: డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

Kalyan Chakraborty: కలకత్తా మెడికల్ కాలేజీలో మహిళా పీజీ వైద్యురాలి (Female PG Doctor)పై జరిగిన అత్యాచారం & హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (TGGDA) తీవ్రంగా ఖండిస్తుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రభుత్వ వైద్యుల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ నగేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ఇందులో భాగంగా కోదాడలోని ఐఎంఏ తో కలిసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. *వారికి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ దీనిపై దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఎస్ఆర్డిఎ (SRDA) జూడ (JUDA) సంఘాల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తుందని, తెలంగాణ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ వైద్యులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైనట్లు, నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు.

ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే రోగులకు (For patients)ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించినట్లు తెలిపారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించేలా, వారికి శిక్ష పడేలా (to be punishedపశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని , అందులో భాగంగా ఇతర వైద్య అనుబంధ సంఘాలు నిర్వహిస్తున్న దేశ వ్యాప్త నిరసన కార్యక్రమంలో అందరు వైద్యులు , ప్రజాసంఘాలు, ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులకు, స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి కి ఐఎంఏ సభ్యులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు