Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kalyana Lakshmi: కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం

–పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండ
–మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయం
–కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Kalyana Lakshmi:ప్రజా దీవెన, నకిరేకల్: కల్యాణ లక్ష్మీ (Kalyana Lakshmi)పధకం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా నిలుస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Viresham) అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా గుడి ఆలయంలో కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండ లంలోని మంజూరైన 67 కల్యాణ లక్ష్మీ చెక్కులను లభ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 67 కల్యాణ లక్ష్మీ చెక్కులను అందు కుటున్న లబ్ధిదారులకు శుభా కాంక్ష లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రె స్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన తర్వాత మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింద న్నారు. నార్కెట్‌పల్లి లో బస్సు డిపో ను పునరావృత్తం చేస్తామని స్పష్టం చేశారు. మన నియెజకవర్గం ని అ న్ని విధాలుగా అభివృద్ధి చేసుకుం దామని చెప్పారు. ముఖ్యమంత్రి గారి చేతులు మీదుగా 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభం చేసు కుందామని, డ్రీగి కళాశాల ను నిర్మా ణం చేసుకుందామని వివరించారు.

నకిరేకల్ పట్టణంలోని పేద విద్యా ర్థులకు, ఫీజుల భారం (For poor students, the burden of fees)లేకుండా నర్సరీ నుండి డ్రీగి వరకు నాణ్యత మైన విద్యను అందిస్తామని అన్నారు. ప్రజల సమస్యల పరి ష్కారానికి ఏల్లపుడు తోడుగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.