–తమపై ఫిర్యాదు చేసి జైలుకు పంపడన్న కోపంతో దారుణం
— కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రజాదీవెన, హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో (Kamareddy) దారుణం జరిగింది. నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో ఇద్దరు యువకులు నాగయ్య అనే వ్యక్తి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నాగయ్యను ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స (treatment) పొందుతున్నాడు.
నాగయ్య దివ్యాంగురాలైన కుమార్తెపై గతంలో నలుగురు యువ కులు అత్యాచారం చేయగా, ఆయన ఫిర్యాదుతో వారంతా జైలుకి (JAIL) వెళ్లారు. ఇటీవలే విడుదలైన నిందితుల్లో ఓ ఇద్దరు నాగయ్యపై కోపంతో హత్యాయత్నం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు (POLICES)దర్యాప్తు చేస్తున్నారు.