–రోడ్ల పై బారికేడ్లు, మెడికల్ కళా శాల గేట్లకు తాళాలు
–నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: గత 20 సంవత్సరాలుగా నల్లగొండకు మెడి కల్ కళాశాల తెప్పిస్తానని, మోస పూరిత వాగ్దానాలు చేసి వాగ్దానం నెరవేర్చుకోలేకపోయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహకారం తో నల్లగొండకు మెడికల్ కళాశాల మంజూరు చేసి రూ. 110 కోట్లతో అద్భుతంగా రూపుదిద్దుకున్న మెడి కల్ కళాశాల నేటి ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవం జరుపు సమయం లో మాజీ ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించకపోవడం విచారకర మని, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రారంభానికి ముందు కెసిఆర్ చిత్రపటానికి కృ తజ్ఞతగా పాలాభిషేకం నిర్వహిం చాలనుకున్న తమ నాయకులను, అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధిం చారని, కళాశాల ప్రారంభం తర్వా త కూడా పోలీసులు అత్యుత్సా హంతో వ్యవహరిస్తున్న తీరు మెడి కల్ కళాశాల ఏమైనా నిషేధిత ప్రాంతం గా ప్రకటించారా అనే అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఈరోజు తాము మెడికల్ కళాశాలను సందర్శించా లనుకున్నామని, కానీ పోలీసులు వ్యవహరించిన తీరు తమను బా ధించిందన్నారు.
గడియారం సెంట ర్ నుండి.. మెడికల్ కళాశాల వర కు పోలీసులను మొహరించి ఎక్క డికక్కడ బారికేడ్లు పెట్టి మెడికల్ కళాశాల గేట్లకు తాళాలు వేసి సాయిదులైన పోలీసుల చేత పహారా కాయించడం తమను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. తామేమైన రౌడీలమా,గుండాలమా అక్కడ ఏమైనా విధ్వంసం సృష్టిం చడానికి వెళ్తున్నామా పోలీసులు ఏం ఆలోచిస్తున్నారో తమకు అర్థం కావట్లేదని వారు అన్నారు.తమ హయాంలో నల్లగొండ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి కట్టించుకున్న మెడికల్ కళాశాల భవనాన్ని సంద ర్శించకుండా పోలీసులు అడ్డుకో వడం ఏమిటని ప్రశ్నించారు.
ఇది . కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిరంకుశ త్వానికి నిదర్శనమని తమ ప్రభు త్వ హయాంలో అప్పటి శాసన సభ్యునిగా కోమటిరెడ్డి మంత్రితో ప్రారంభించాలనుకున్న నల్లగొండ ఆర్డిఓ ఆఫీసును ప్రోటోకాల్ కు విరుద్ధంగా తాను కొబ్బరికాయ కొట్టి అప్పటి మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అవమానించారు. తాము అలాంటి చిల్లర పనులు చేయలేదని, కేవలం తమ హ యాంలో నిర్మించుకున్న మెడికల్ కళాశాల భవనాన్ని సందర్శిం చాలని మాత్రమే అనుకున్నామని అన్నారు.నల్లగొండ ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు పోలీసులు తమ వైఖ రి మార్చుకొని, మెడికల్ కళాశాల సందర్శనకు తమకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.