–మంత్రి ఇలాకాలో అభివృద్ధి పను లు నత్తనడకన
Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, కనగల్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ నియోజక వర్గంలో అభివృద్ధి పనులు నత్తన డకన సాగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) అన్నారు. ఆదివారం కనగల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో (Press conference) ఆయన మాట్లాడారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో తాను నల్లగొండ అభివృద్ధి కోసం 1350 కోట్లు మం జూరి చేయించి పనులు చేయిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులన్నీ నిలిచి అభివృద్ధి కుంటు పడిందన్నారు.
90 కోట్లతో నిర్మిం చిన ఐటి హబ్ ను నిరుపయోగం గా మార్చారన్నారు. మర్రి గూడ ఫైఓవర్ బస్టాండ్ నుండి గొల్లగూడ రోడ్డు, డీఈ ఓ ఆఫీస్ నుంచి కలెక్ట రేట్ రోడ్డు పనులు అసంపూర్తిగా మిగిలాయని విమర్శించారు. ఎన్జీ కాలేజీ, మెడికల్ కాలేజీ పనులు నత్తనడకన సాగుతుండగా కళా భారతి పనులు ప్రారంభం కాలే దన్నారు. 224 కోట్లతో పాన గల్ ఉదయ సముద్రం సుందరీ కరణ పనులు పార్కు లు శిల్పా రామం ఛాయా పచ్చల వెంకటేశ్వర దేవాలయాల పునరుద్దరణ (Restoration of Venkateswara Temples) పనులు బతుకమ్మ కుంట నెక్లెస్ రోడ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ 40 శాతం మంది రైతులకు వర్తించిందన్నారు. మిగతా వారికి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు.
మంత్రి నిర్లక్ష్యం కారణంగా ఎ ఏం ఆర్పి పరిధిలోని డి 25,37,39,40 కాలువల కింద చెరువులు కుంటలు నిండక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. నల్లగొండ దేవరకొండ మధ్యగల ప్రధాన రహదారిని 4 లైన్ల రోడ్డుగా (road) విస్తరించాలన్నారు. కనగల్ ఎక్స్ రోడ్డును జంక్షన్ గా మార్చేందుకు నిధులను కేటాయించాలన్నారు. సీఎం (cm) కు సన్నిహితుడిగా చెప్పుకుంటున్న మంత్రి 4 వేల కోట్లు నిధులు మంజూరి చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలోనల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ ఎంపీటీ సీ పాలకూరి సైదులు గౌడ్, రావుల శ్రీనివాసరెడ్డి, చనగోని నాగరాజు గౌడ్,నక్కల రమేష్, బచ్చగొని కిరణ్,రాయలగిరి, నర్సింగ్ మధు గౌడ్, శిరిశాల కిషన్, వేముల నరహరి, ఎన్ మహేష్, ఎం పెద్దులు, శంకర్ నాథ్,శివశంకర్ తదితరులున్నారు,