BRS BhupalReddy : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిర్వ హించ తలపెట్టనున్న రైతు మహాధ ర్నాకు పోలీసులు అనుమతి నిరా కరించారు.రైతులతో మహాధర్నా ను మంగళవారం నిర్వహించేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న విషయం విధితమే. ఈనెల 21న పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్య క్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా నాయ కులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచే శారు. జిల్లాలో గ్రామ సభలు, సం క్రాంతి రద్దీ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ జిల్లా పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
మహాధర్నా నిర్వహించి తీరు తాo.. నల్లగొండలో ఎట్టిపరిస్థితు ల్లో మహా ధర్నా నిర్వహించి తీరు తామని బీఆర్ఎస్ నేత, మాజీ మం త్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పా రు. శాంతియుతంగా నిర్వహించే దర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వ రని ఆయన ప్రశ్నించారు. ఇక ముం దస్తు ప్రణాళిక ప్రకారం కేటీఆర్ రైతు దీక్ష జనవరి 12న జరగాల్సి ఉంది. సంక్రాంతి పండుగ నేపథ్యం లో రైతు ధర్నాను వాయిదా వేశా రు. అనంతరం జిల్లా నేతలో చర్చిం చిన కేటీఆర్ ఈ నెల 21న రైతు ధర్నా నిర్వహించాలని నిర్ణయిం చారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ పోలీసులు అనుమతి కోరారు. అయితే పోలీసులు అను మతులు నిరాకరించారు.
పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో నల్లగొండ మాజీ ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లా డుతూ ముందస్తుగానే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా పోలీ సులు చివరిసమయంలో నిరా కరి స్తూ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వపరంగా ఒత్తిడి కారణంగానే న్యాయబద్ధం గా అనుమతి కోరగా నిరాకరించా రని, పోలీసులు నిరాకరించినంత మాత్రాన ఊరుకునే ప్రసక్తే లేదని రైతు ధర్నాను న్యాయపోరాటం ద్వారా నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.