— ఈనెల 28వ తేదీన రైతు మహా ధర్నాకు హైకోర్టు అనుమతి
–రైతు మహాధర్నాకు రైతన్నలు కదిలిరావాలి
–నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : దివ్యాంగుడినైన తనపై కాంగ్రెస్ గుండాలు జరిపిన దాడిని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తా నని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచ ర్ల భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు.ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన తనకే రక్షణ లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నిం చారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు దుర్బుద్ధితో ఈ నెల 21న నల్లగొండ పట్టణంలో నిర్వహించాల్సిన రైతు మహాధ ర్నాను అడ్డుకున్నారని ఆరోపించా రు. న్యాయం కోసం తాము హైకో ర్టును ఆశ్రయించడంతో ఈ నెల 28వ తేదీన క్లాక్ టవర్ సెంటర్ వద్ద రైతు మహాధర్నాను నిర్వ హించుకునేందుకు కోర్టు అనుమ తిచ్చిందని చెప్పారు. కోర్టు తీర్పు పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. రైతు మహా ధర్నాకు రైతులు కదం తొక్కాలని కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15000 ఇస్తామని, ఆసరా పెన్షన్ రూ. 4000 ఇస్తామని, మహిళల ఖాతాలో రూ.2500 వేస్తామని చెప్పి మోసం చేసిందని ఆయన ఆరోపించారు.ఏక మొత్తంలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగాన్ని ఘోరంగా మో సం చేసిందని విమర్శించారు.
రా ష్ట్రంలో 30 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని ఆ యన ఆరోపించారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని భూపాల్ రెడ్డి పిలుపు నిచ్చారు. నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ ను చూసి భయపడి రైతు ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఇప్పుడు కోర్టు అనుమతితో రెట్టించిన ఉ త్సాహంతో సభను విజయవంతం చేస్తామని తెలిపారు. టాడీ కార్పొ రేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికు మార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు వాగ్దానాలకు ప్రజ లు మోసపోయి నేడు అడుగడుగు నా వారిని ప్రజలు ఎండ కడుతు న్నారని ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన వాగ్దానం నిలబెట్టుకునే విధంగా ప్రజలకు మేలు చేయాలని కోరారు.
దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అడుగడుగు నా మోసం చేసిందని బీ ఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పను లకు తమ పేర్లు పెట్టుకుని కాంగ్రెస్ మంత్రులు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చే శారు. వారు చేసిన పని ఒక్కటంటే ఒక్కటి లేదని ఘాటుగా విమర్శిం చారు. జాగృతి నేత రాజీవ్ సాగర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులకు భయపడి రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదని, ప్లెక్సీలు తొలగించిన మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నిం చడానికి వెళ్లిన మాజీ శాసనస భ్యులు కంచర్లపై కాంగ్రెస్ గుండాల దాడి అమానుషమని అన్నారు. దివ్యాంగుడని కూడా దాడి చేశార ని ఈ దాడిసంఘటనను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇప్ప టికే తాము ఎస్పీకి, డిజిపి కి ఫిర్యా దు చేశామని, మానవ హక్కుల కమిషన్ కు కూడా తాము ఫిర్యా దు చేయనున్నామని చెప్పారు.
ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్, సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, కనగల్ సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవ రెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యు లు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, బొజ్జ వెంకన్న , మాజీ జెడ్పిటిసి తుమ్మల లింగస్వామి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్,నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, సిరిగిరి వెంకటరెడ్డి, బడుపుల శంకర్ మాజీ ఎంపీ టీసీలు, పొగాకు గట్టయ్య, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి ఉట్కూరు సందీప్ రెడ్డి, మెండు మణిపాల్ రెడ్డి, మాజీ సర్పంచు కడారి కృష్ణయ్య. పేర్ల అశోక్, శ్యాంసుందర్, వీరమల్ల భాస్కర్ షరీఫ్, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయన నాగార్జున, వెంకన్న, జిల్లా రవి, తదితరులు పాల్గొన్నారు.