Kandukuri Somanna : ప్రజా దీవెన, శాలిగౌరారం: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణ రాష్టంలో అమలు చేస్తే మాదిగలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎం ఎస్ పి ఉమ్మడి నల్లగొండ జిల్లా కో ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ, ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగలు అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతులు రథయాత్ర రాత్రి శాలిగౌరారం మండలం కేంద్రానికి చేరుకుంది మండలంలో ఏర్పాటు చేసిన లక్ష డప్పులు వేల గొంతులు మహా ప్రదర్శన మండల సదస్సుకు కారుపాటి అంబేద్కర్ మాదిగ అధ్యక్షత జరిగింది
ఈ సభకు ముఖ్య అతిథులుగా కందుకూరి సోమన్న మాదిగ,బోడ సునీల్ మాదిగ హాజరై డా బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం సభలో పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్టాలు చేసుకోవచ్చు అని తీర్పునిచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయాలని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఫిబ్రవరి 07న హైదరాబాద్ లో జరిగే లక్షల డప్పులు వేల గొంతులు మండే మాదిగల గుండె చప్పుడు మహా ప్రదర్శనకు ప్రతి గ్రామం నుంచి ప్రతి మాదిగ బిడ్డ డప్పు తీసుకొని హైదరాబాద్ చేరుకోవాలని పిలు పునిస్తున్నాం.
ఈ రథయాత్రకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అన్నేబోయిన సుధాకర్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు జమ్ము రమేష్, ఎరుకుల సంఘం జిల్లా నాయకులు కూతాటి సోమయ్య మండల నాయకులు సుల్తాన్ వెంకన్న బి ఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షులు కల్లూరి నాగరాజు, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లికొండ గణేష్ బేడ బుడిగే జంగం జిల్లా నాయకులు పర్వతం అంజనేయు లు పాల్గొని మద్దతూ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ,ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ కళాకారుల కవాతు ఉమ్మడి జిల్లా ఇంచార్జీ కాటపాక శంకర్, గాయకురాలు చెరుకు మల్లికా పాలడుగు అంజి, మహిళా కళా మండలి ఉమ్మడి జిల్లా ఇంచార్జీ దాసరి రాణి ఎమ్మార్పిఎస్ మండల నాయకులు బట్ట శ్రీను, కారుపాటి అంబేద్కర్ ఎర్ర అనుదిప్ ఎం ఎస్ ఎఫ్ నకిరేకల్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాటిపాముల సైదులు బట్ట చిన్న సైదులు,బట్ట లక్ష్మ ణ్, దేవరకొండ జానయ్య, మాచర్ల అంజయ్య గద్దపాటి అరవింద్ కళా నేతలు వేముల నాగరాజు చిప్పల పల్లి మల్లేష్ యాతాకుల రఘు సీత రాజు ఇరిగి శ్రీను డప్పు మనోహర్ దేవరకొండ కృష్ణమూర్తి మాగి రవి రాచకొండ గణేష్ బాకీ వెంకటయ్య తదిత రులు పాల్గొన్నారు.