Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Karne Prabhakar : మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేసిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

Karne Prabhakar : ప్రజా దీవన, నారాయణపురం : సంస్ధాన్ నారాయణపురం గ్రామానికి చెందిన కీ.శే వీరమల్ల యశోద గారు ఇటీవల మరణించగా వారి దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా నిరుపేద కుటుంబానికి సాయం అందించాలని మానవత దృక్పథంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమాచారాన్ని అందించిన వెంటనే గొప్ప మనసుతో నారాయణపురం గ్రామ బిడ్డ గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకరన్న మరణించిన బాధిత కుటుంబానికి రూ.10 వేల రూపాయల విలువగల నిత్యవసర సరుకులను బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అందజేశారు.

 

 

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ మన గ్రామ ప్రజల కష్టాల్లో తోడుంటూ మన కుటుంబల్లో పెద్దకొడుకై నిలుస్తున్న కర్నె ప్రభాకరన్న గ్రామ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ… ఆపదలో ఉన్నమన్న అనే సమాచారాన్ని తెలిసిన వెంటనే అరక్షణమైన ఆలోచించకుండా వెంటనే కష్టాల్లో తోడుండి, సమస్యలను పరిష్కరించే గొప్ప నాయకుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం లారీ బిక్షం,ఎడ్ల సత్తయ్య,శికిలమెట్ల ప్రభాకర్, ఉప్పల ఆంజనేయులు, పేర రమేష్, చింతకింది సుధాకర్ ,జక్కల వెంకటేష్, ఎడ్ల పరమేష్ తదితరులు కుటుంబ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు‌.