Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Karne Prabhakar : ఆపదలో ఉన్న వారికి నేనున్నానని ఆదుకుంటున్న మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తెలంగాణ బిక్షం

Karne Prabhakar : ప్రజా దీవన, నారాయణపూర్ : గ్రామంలో ఎవరికీ ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా నేను ఉన్నాను అంటూ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆదుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తెలంగాణ బిక్షం అన్నారు. సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన సోమనబోయిన అశోక్ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు.ఈ విషయం తెలుసుకున్న కర్నే ప్రభాకర్ అతని దశదినకర్మకు క్వింటాల్ బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం,చిలువేరు బిక్షపతి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ గిరి,గుండమల్ల సతీష్ కుమార్,ఎండ్ల సత్తయ్య,బొమ్మన గోని రమేష్,సంద శ్రీకాంత్,బండి సుధాకర్,సోమనబోయిన చంద్రశేఖర్ యాదవ్, లింగ స్వామి యాదవ్,శంకర్ బాబు,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.