Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kaushik Reddy : *పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ హేమమైన చర్య *

-చట్టబద్దంగా ప్రశ్నిస్తే కేసులు పెడుతారా..?

-కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపాటు

*బేషరతుగా కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి*

*జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి *

Kaushik Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నువ్వు బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తివి..ఏ పార్టీ నుంచి నువ్వు మాట్లాడుతున్నవో చెప్పాలి? అని చట్టబద్దంగా ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడం హేమమైన చర్యగా అభివర్ణించారు. నిజాలను నిగ్గు తేల్చే ప్రజా గొంతుకలను సహించలేక ఈ ప్రభుత్వం వారి హక్కులను కాలరాస్తుం దన్నారు. కేవలం ప్రశ్నించినందుకే అక్రమంగా 3సెక్షన్ లు పెట్టారని విమర్శించారు.

 

ఈ కాంగ్రెస్ పరిపాలనలో నిర్బంధాలు, ఆంక్షలు నిత్య కృత్యమయ్యాయి..ప్రభుత్వం పెడ్తున్న అక్రమ కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజా క్షేత్రంలో పాలన వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటామని హేచ్చరించారు. పాడి కౌశిక్‌ రెడ్డి పై బనాయించిన అక్రమ కేసులను స్పీకర్ గారు చొరవ తీసుకోని న్యాయ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వెంటనే అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.