Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kavitha bail petition: కవిత బెయిల్ విచారణ రేపటికి వాయిదా

డిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam)కేసులో కవిత బెయిల్ పిటి షన్(Kavitha bail petition postponed ) మంగళవారం కు వాయిదా పడింది.

మంగళవారం వాదనలు పూర్త య్యాక తీర్పు రిజర్వ్ చేస్తానని చెప్పిన న్యాయమూర్తి
కేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జస్టిస్‌ స్వర్ణ కాంత

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam)కేసులో కవిత బెయిల్ పిటి షన్(Kavitha bail petition postponed ) మంగళవారం కు వాయిదా పడింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టగా సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై మంగళవారం విచారణ జరగనుం డగా ఈ కేసులో బెయిల్ కోరడంతో పాటు అరెస్టు, రిమాండ్‌ను కవిత సవాల్ చేశారు. ఎమ్మెల్సీ కవిత తరఫున సోమవారం విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరె స్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లం ఘించాయని ఆరోపించారు. కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి పలు కీలక విషయాలను కోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. కవితపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీం కోర్టులో ఈడీ అండర్ టేకింగ్ (ED Undertaking)ఇచ్చిందని కవిత వేసిన రిట్ పిటిష న్ సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని తెలిపారు.

తాము ఇచ్చిన అండర్ టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని చెప్పారు. సుప్రీంకోర్టులో(Supreme court) కేసు పెండింగులో ఉండగానే 41(ఏ) ప్రకారం సమన్లు జారీ చేశారని ఆయన గుర్తుచేశారు. సీఆర్పీసీ 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చినవారు, తర్వాత 41(ఏ)కు ఎందుకు మారారో తెలియదన్నారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగుతుండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందని తెలి పారు.అదే రోజు ఈడీ కవితను అరె స్టు చేస్తున్నట్టు ప్రకటించిందన్నారు. ఇదిలా ఉంటే జ్యుడీషియల్ కస్టడీ లో ఉండగానే కవితను ప్రశ్నించా లంటూ సీబీఐ పిటిషన్ వేయగా సదరు పిటిషన్‌ను కోర్టు అంగీకరిం చింది. కానీ కవితకు మాత్రం ఎలాం టి సమాచారం లేదని, సీఆర్పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నిం చాలంటే కవిత వాదన కూడా పరిగ ణలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసిందని గుర్తు చేశారు.

Kavitha bail petition postponed in Delhi liquor scam