KCR Birthday : ప్రజా దీవెన శాలిగౌరారం: తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను శాలిగౌరారం మండలం గురజాల మానాయికుంట మూసీ నది బ్రిడ్జి మీద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి అయన రాష్టానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐతగోని వెంకన్న గౌడ్,రాష్ట్ర నాయకులు మామిడి సర్వయ్య, మాజీ అధ్యక్షులు కట్ట వెంకటరెడ్డి, మాజీ రైతు బంధు అధ్యక్షులు గుండా శ్రీనివాస్, చాడ హతీశ్ రెడ్డి, శేఖర్ బాబు.దుబ్బ వెంకన్న, దాసరి నతానియల్, మామిడి రమేష్,రాచకొండ గణేష్, దాసరి వెంకన్న,పనికెర కమలాకర్, భూపతి ఉపేందర్, బాకీ వెంకన్న, నూక జనయ్య, బడే సాబ్, మాచర్ల వెంకన్న,బొడ్డు విజయ్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
వల్లాల శివాలయం లో ప్రత్యేక పూజలు
శాలిగౌరారం మండలం వల్లాల శివాలయం లో బిఆర్ ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కేక్ కట్ చేసి గ్రామస్తులకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండ్లపెల్లి రవీందర్, జిల్లా నాయకులు భూపతి ఉపేందర్, నాయకులు మాదగోని నాగయ్య, కొల్లు సత్తిరెడ్డి, రాగి దావీద్, మాదగోని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.