KCR : ప్రజా దీవెన,కోదాడ: కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు, BRS పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలు కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగేళ్ళ సుధీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చారిత్రాత్మక పధకాలకు రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ప్రజల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడ్డారని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేసిన మహోన్నత వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసమర్థ చేతకాని కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పధకాలు ప్రజలకు అందించలేని ఈ దుష్ట పాలన అంతం అయ్యి మరోసారి రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేసి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి పయిడిమర్రి సత్యబాబు, తాజా మాజీ కౌన్సిలర్స్ మేదర లలిత, కందుల చంద్రశేఖర్, మామిడి రామారావు, అలవాల వెంకట్, షేక్ సాధిక్, సంపెట ఉపేందర్ గౌడ్, చింతల నాగేశ్వరరావు, పిట్టల భాగ్యమ్మ, కర్ల సుందర్ బాబు, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్, దొంగరి శ్రీనివాస్, కనగాల శ్రీధర్, కలకొండ గోపయ్య, చీమ శ్రీనివాసరావు, కర్ల నరసయ్య, షేక్ అబ్బుబకర్, మహ్మద్ షాకీర్, చింతల లింగయ్య, బత్తుల ఉపేందర్, సోమపంగు నాగరాజు, షేక్ తాజ్, బచ్చలకూరి నాగరాజు, షేక్ అలీమ్, షేక్ నిస్సార్, షేక్ ఆరీఫ్ , కాసాని మల్లయ్య గౌడ్, చలిగంటి వెంకట్, జానీ ఆర్ట్స్, గంధం శ్రీను, బొర్రా వంశీ, గొర్రె రాజేష్, సుంకర అభిధర్ నాయుడు, పంది శంకర్, పంది లక్ష్మయ్య, షేక్ మగ్ధూం, షేక్ దస్తగిరి, షేక్ బడేమియా, షేక్ ఖాజీ, షేక్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.