Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్షాలపై నాడు కేసీఆర్ సైబర్ దాడి
దేశాన్నే కుదుపు కుదిపిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను గతంలో చెప్పిందే నిజమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కు మార్ స్పష్టం చేశారు.
ఎమర్జెన్సీకంటే దారుణమైన కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ఉల్లంఘించిన ఘనుడు కేసీఆర్
రాధాకిషన్ రావు వాంగ్మూలమే నిలువెత్తు నిదర్శనం
ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవికి అర్హుడు కాజాలడు
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు
వడ్ల స్కాంలో ఉత్తమ్, ఫోన్ ట్యా పింగ్ లో కేసీఆర్ ను కాపాడటం వెనుక మతలబెంటి
రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కేటీఆర్ లను అరెస్ట్ చేసిప్రాసిక్యూట్ చేయాలి
తక్షణమే సీబీఐ తో సమగ్ర విచార ణ జరిపించాలి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశాన్నే కుదుపు కుదిపిన ఫోన్ ట్యాపింగ్(Phone tapping) విషయంలో నేను గతంలో చెప్పిందే నిజమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ(Bandi Sanjay kumar) బండి సంజయ్ కు మార్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదే శాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసిన ట్లు రాధాకిషన్ రావు(Radhakishan rao) పోలీసుల విచారణలో వెల్లడించడమే ఇందు కు నిలువెత్తు నిదర్శనమని వ్యా ఖ్యానించారు. రాధా కిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్ ను పరిశీలిస్తే ప్రతిపక్షాలపై ముఖ్యంగా బీజేపీపై దాడి కోసమే ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించుకున్నట్లు అర్ధమ వుతోందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ సానుభూతిప రులతోపాటు పార్టీకి విరాళాలు ఇచ్చేవాళ్లను, మీడియా ప్రతినిధు లను సైతం ఫోన్ ట్యాపింగ్ తో టార్గెట్ చేశారంటే కేసీఆర్ కు బీజేపీ అంటే ఎంతగా వణుకుపుడుతోoదో తెలుస్తోందని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిన బిడ్డను కాపాడుకునేందుకే కేసీఆర్ ఎమ్మె ల్యేల కొనుగోలు అంశాన్ని స్రుష్టిం చినట్లు రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ తో తేలిపోయిందన్నారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ అదే రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలను భయపెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేయడం ముమ్మాటికీ రాజ్యాంగ ద్రోహమే అని, ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేయడమేనని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తమకున్న ప్రత్యేకమైన హక్కులను కాపాడటం దేవుడెరుగు, దేశ పౌరుడికి ఉండే కనీస ప్రాథమిక హక్కులను కూడా ఫోన్ ట్యాపింగ్ తో కాలరాసిన ఘనుడు కేసీఆర్ అని దుయ్యబ ట్టారు. ఫోన్లో భార్యాభర్తల మాట్లా డుకునే అంశాలను కూడా ట్యాపిం గ్ చేయడం ద్వారా కుటుంబ వ్యవ స్థను చిన్నాభిన్నం చేసేందుకు యత్నించిన కిరాతకుడని వ్యాఖ్యానించారు.
ఇట్లాంటి దుర్మార్గులు ఎమ్మెల్యేగానే కాదు కదా భవిష్యత్తులో రాజ్యాంగబ ద్దంగా ఏ పదవి చేపట్టడానికి కూడా అర్హులు కాదని స్పష్టం చేశారు. పొరపాటున మళ్లీ కేసీఆర్ అధి కారంలోకి వస్తే ఇదే పని వేస్తారని, కాబట్టి అయనపై తక్షణమే అనర్హత వేటు వేయాలని, మళ్లీ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని బీఆర్ఎస్ వ్యవస్థాపకుడైన కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉ న్న ఆయన కొడుకు కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు(BRS PARTY PHONE TAPPING) ఫోన్ ట్యాపింగ్ పాపంలో భాగం పంచుకు న్నందున అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును సైతం రద్దు చేసే అంశంపై ఆలోచించాలని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు న్నప్పటికీ కాంగ్రెస్(congress) ప్రభుత్వం ఆయ నను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నింది తుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నట్లు తెలిసినా ఎందుకు భారత్ కు రప్పించలేకపోతున్నారని, ప్రభా కర్ రావును అరెస్ట్ చేస్తే మరిన్ని వాస్తవాలు బయటకొచ్చే అవకాశ ముంది కదా అయినా ఎందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నిస్తూ తక్షణమే కేసీఆర్(CM KCR) ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా స్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే సీబీఐకి లేఖ రాయాలని, సీబీఐతో సమగ్ర విచా రణ జరిపించాలని, అట్లాగే ఎమ్మె ల్యే పదవికి కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించే అంశంపైనా శాసనసభ స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పక్షాన కోరుతున్నామని పేర్కొన్నారు.
KCR cyber attack on opposition with phone tapping