–కేసీఆర్ రిట్ పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
–రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం
–పిటిషన్ ను తోసిపుచ్చిన చీఫ్ జస్టిస్ బెంచ్
KCR:ప్రజా దీవెన, హైదరాబాద్: నిష్పక్షపాతంగా వ్యవహరించని జస్టిస్ నరసింహారెడ్డి (Justice Narasimha Reddy) కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు (KCR) దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ (Writ Petition) ను విచారించిన ధర్మాసనం దానిని డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించిం ది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుం ది. విద్యుత్ కొనుగోలు ఒప్పందా లు, థర్మల్ ప్లాంట్లపై విచారణకు ఆదేశి స్తూ ఇటీవల ప్రభుత్వం జస్టి స్ నరసింహారెడ్డి (Justice Narasimha Reddy) కమిషన్ ను ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే. రా ష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (Advocate General) వాదనలు వినిపించగా కమిషన్ ఏర్పాటులో కోర్టులో కలుగజేసుకోలేవని, 15 మంది సా క్ష్యులను ఇప్పటి వరకు విచారిం చినట్లు ఏజీ వాదనలు వినిపించా రు. విచారించిన వారిలో ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులున్నారని, ప్రభా కర్‌రావును కూడా విచారించామని తెలిపారు. కేసీఆర్‌కు కమిషన్ ఏప్రి ల్‌లో నోటీసులు జారీ చేసిందని, పార్లమెంట్ ఎన్నికల కారణంగా సమయం కావాలని చెప్పారన్నారు. జూన్ 30 వరకు కమిషన్‌కు గడువు ఉందని, జూన్ 15న విచారణకు రావాలని కమిషన్ కోరిందని తెలి పారు. జగదీష్ రెడ్డి (Jagadish Reddy)నుంచి సైతం కమీషన్ వివరాలు సేకరించిందన్నా రు. కేసీఆర్ వేసిన పిటిషన్‌పై వాదో పవాదాలు విన్న తర్వాత హైకోర్టు డిస్మిస్ చేసింది.