KCR Name: బొమ్మ పడింది..!
విద్యా సంవత్సరం పునః ప్రారం భమైన వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదే శాలు జారీ చేసింది.
తెలంగాణ పాఠ్యపుస్తకాలలో కేసీఆర్ బొమ్మ
వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం
ముద్రించిన పుస్తకాలాన్ని వెనక్కి చెప్పిస్తున్న వైనం
ప్రజా దీవెన, హైదరాబాద్: విద్యా సంవత్సరం పునః ప్రారం భమైన వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో(Telangana textbooks) పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదే శాలు జారీ చేసింది. దీంతో, పుస్త కాలన్నీంటినీ సేకరిస్తున్నారు. వివ రాలలోకి వెళితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముం దుమాట మార్చకుండానే కొత్త బుక్స్ ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆఎస్ ప్రభు త్వంలో మాజీ సీఎం కేసీఆర్(Former cm Kcr), మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు.
కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నిం టినీ వెరిఫికేషన్(Verification) చేయగా విద్యార్థు లకు పంపిణీ చేసిన అన్ని తరగ తుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటం తో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్(State Chief Minister Chandrasekhar rao), మంత్రు లు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకు లు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్త కాలను వెనక్కి తీసుకోవాలని ఆదే శాలు జారీ చేసింది.
KCR figure in Telangana textbooks