Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR- KAVITHA: కవితకు కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం

KCR- KAVITHA: ప్రజా దీవెన, సిద్దిపేట: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో బెయిల్ (BAIL) వచ్చిన తరు వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త న తండ్రి బీఆర్ఎస్ అధినేత, మా జీ సీఎం కేసీఆర్‌ ని గురువారం కలి శారు. హైదరాబాద్‌ నుంచి ఉదయా న్నే బయల్దేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ( Erravalli) ఉన్న ఫాంహౌజ్‌కి చేరు కున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. ఆమె కు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీ య స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకు న్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనం తరం ఆమె కేసీఆర్ పాదాలకు నమ స్కరించారు.

కూతురుకు ఆత్మీయ ఆహ్వా నం (warm invitation)…గురువారం ఎర్రవెల్లి నివా సానికి చేరుకున్న కేసీఆర్ తనయ ఎంఎల్సీ కవిత ఆమె భర్త, కుమా రుని తో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. దిష్టి తీసి స్వాగతం పలికారు ఫామ్ హౌస్ సిబ్బంది. కన్న బిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ (KCR) భోవోద్వేగానికి గురయ్యా రు. అక్రమ నిర్బంధం నుంచి బయ టకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కం డ్లల్లో ఆత్మీయ ఆనందం కనిపిం చింది. తండ్రి పాదాలకు కవిత నమ స్కరించగా బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు కేసీఆర్. ఆలింగనం చేసుకున్న వెం టనే మోములో ఆనందం స్ప ష్టంగా కనిపించింది. తమ అధినేత సంతో షంలో భాగ స్వామ్యులైన నేతలు, సిబ్బంది కేసీఆర్ పాదాలకు పార్టీ నే తలు, నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్న కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ (KCR) నివాసంలో సంతోషాలు వెల్లివిరిసాయి.

హుషారులో గులాబీ దళపతి
ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజ యంపాలవ్వడం, మరోవైపు కవిత అరెస్ట్ (KAVITHA ARREST), ఇంకోవైపు లోక్ సభ ఎన్ని కల్లో సున్నా సీట్లకు పరిమితం కావ డంతో బీఆర్ఎస్ (BRS) శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. అయితే చా న్నాళ్ల తరువాత కేసీఆర్ ముఖంలో ఇవాళ ఉత్సాహం, సంతోషం కని పించిందని ఆ పార్టీ నేతలు అంటు న్నారు. కవితను అక్రమంగా నిర్బం ధించారని చివరికి సత్యమే గెలిచిం దని చెబుతున్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం కోలా హలంగా మారింది.