Jagadeesh reddy: చావు నోట్లో తలపెట్టి.. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించాం
రాదే.. రాదనుకున్న తెలంగాణను చావు నోట్లో తలపెట్టి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అహింసాయుత మార్గంలో ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని, ముందు కురికించి ప్రత్యేకత రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసిఆర్ అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ జగదీశ్ రెడ్డి కొనియాడారు
అధికారం లేకపోయినా ప్రజల అభ్యున్నతి కోసం తపనపడే నాయకుడు కేసీఆర్
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పార్టీ జెండా ఎగరవేసిన జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
ప్రజా దీవెన నల్లగొండ: రాదే.. రాదనుకున్న తెలంగాణను చావు నోట్లో తలపెట్టి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అహింసాయుత మార్గంలో ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని, ముందు కురికించి ప్రత్యేకత రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసిఆర్ అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ జగదీశ్ రెడ్డి (Jagadeesh reddy) కొనియాడారు
భారత రాష్ట్ర సమితి పార్టీ 24 వ ఆవిర్భావ దినోత్సవాన్ని(Bharat Rashtra Samiti Party foramtion day)
పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వీటి కాలనీలో లోగల జిల్లా బిఆర్ఎస్ పార్టీ, కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం తెలంగాణ తల్లి,బాబాసాహెబ్ అంబేద్కర్, ఆచార్య జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు(Martyrs) జోహార్లు అర్పించారు.
నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ను శాలువాతో సత్కరించి, వారి నాయకత్వంలో నల్లగొండ జిల్లా లో పార్టీ పునర్వైభవం సంతరించుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారమున్న లేకపోయినా తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం తపనపడే నాయకుడు కేసీఆర్(KCR) అని, కెసిఆర్ తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల మేలు కోరే పార్టీ మరోటి లేదన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్లు కటికం సత్తయ్య గౌడ్, రామచంద్రు నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు,చీర పంకజ్ యాదవ్,బొర్ర సుధాకర్,మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా,సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, ఫరీరోద్దీన్, సింగం రామ్మోహన్, మైనం శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, ఆలకుంట్ల నాగరత్నం రాజు,పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
KCR life risk for telangana