ప్రజా దీవెన, శాలిగౌరారం: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల బి ఆర్ ఎస్ నాయకులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.మాజీ మండల పార్టీ అధ్యక్షులు కట్ట వెంకటరెడ్డి ని,రైతు బందు మండల కన్వీనర్, గురిజాల తాజా మాజీ సర్పంచ్ గుండా శ్రీనివాస్ ను కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు.
బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేసీఆర్ కోరారు.వీరి వెంట బిఆర్ఎస్ నాయకులు యల్మకంటి యాదయ్య, ముత్యాల వెంకన్న, దొనకొండ అంజయ్య లు ఉన్నారు.