KCR tribute to immortals: అమరులకు కెసిఆర్ నివాళి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్స వాలను బీఆర్‌ఎస్ ప్రారంభించింది. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుక ల్లో భాగంగా మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించాలని గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయిం చిన క్రమంలో భాగంగా శనివారం కేసీఆర్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాం జలి ఘటించారు.
అమరులకు కెసిఆర్ నివాళి
అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్, హరీశ్ ముఖ్యనేతలు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్స వాలను(Telangana formation day celebrations) బీఆర్‌ఎస్ ప్రారంభించింది. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుక ల్లో భాగంగా మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించాలని గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయిం చిన క్రమంలో భాగంగా శనివారం కేసీఆర్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాం జలి ఘటించారు. అనంతరం కొవ్వొ త్తిని చేతబట్టి పార్టీ నాయకులతో కలిసి సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు కొవ్వొ త్తుల ర్యాలీని ప్రారంభించారు. కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ మంత్రు లు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, పార్టీ ఇతర ముఖ్య నేతలు నేతలు పాల్గొని అమర వీరుల స్థూపం వరకు పాదయా త్రగా వెళ్లారు.
అక్కడ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు (Martyrs of Telangana)తెలంగాణ అమరవీరులను స్మరి స్తూ గీతాలను ఆలపించారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నా రు. ఈ సంధర్బంగా అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ (ktr)ఉద్వేగంగా మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్(kcr) 24 ఏళ్ల క్రితం టీఆర్‌ఎస్‌ను ప్రారం భించారని, 2001 ఏప్రిల్ నుంచి 2014 జూన్ వరకు అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెను కడుగు వేయలేదని, రాష్ట్రం ఏర్పడి దశాబ్దకాలమైనందున ఇక్కడ కనిపి స్తోన్న అందమైన సచివాలయం, అమరవీరుల జ్యోతి, ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం తెలంగాణలో జరిగిన అభివృద్ధికి చిన్న ఉదా హరణ అని పేర్కొన్నారు.
తెలం గాణ మట్టి బిడ్డగా గర్వపడు తున్నానని వ్యాఖ్యానించారు. పదేళ్లు విజయవంతంగా పభ్రుత్వా న్ని నడిపామని, దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. అమరుల (immortals)త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం లో వారిని స్మరించుకునే అవకా శాన్ని రేవంత్ ప్రభుత్వం కల్పించడం లేదని బాల్క సుమన్, రసమయి ఆరోపించారు. కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతినిచ్చిన సర్కారు మైకుల వినియోగంపై నిషేధం విధించిందని వాపోయారు. మైకులను పోలీసు లు తీసుకెళ్లి మా గొంతులను ఆప లేరని, అమరుల(Immortals) త్యాగాలను స్మరిం చుకునేందుకు గాయకుల గొంతు లు, ప్రజల కోరస్ చాలని, పోలీసుల తీరు సరైంది కాదని వ్యాఖ్యానిం చారు. కాగా పోలీసులు మైకులను తీసుకెళ్లే సమయంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బాల్క సుమన్ తదిత రులు వారితో వాగ్వాదానికి దిగారు.
KCR tribute to immortals