KCR’s Birthday : ప్రజా దీవెన,కోదాడ: కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని స్థానిక రెండవ వార్డు నాలుగో వార్డు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగేళ్ళ సుధీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చారిత్రాత్మక పధకాలకు రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ప్రజల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడ్డారని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేసిన మహోన్నత వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తమ్మర 2, 4 వార్డు బిఆర్ఎస్ నాయకులు గుండె రాజేష్, చిన్నం జాన్ బాబు, చిన్నం కన్నయ్య, చింతా చిన్నబాబు ,పెద్దపంగు బాబు, వంగూరి జాను, కురుమూర్తి నవీన్, చిన్నం వెంకటేష్, సిద్దెల కార్తీక్ ,సిద్దెల మధు, కొంగల చిలకయ్య, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు