KCR’s Birthday : నాంపల్లి ప్రజా దీవెన ఫిబ్రవరి 18 బి ఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ జాతిపిత రైతు బాంధవుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు వేడుకలను నాంపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం రోజున మండల ప్రజలు పార్టీ నాయకులు టపాకాయలు కాల్చి కేకులు కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు వేడుకలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు జి నరసింహారావు మాట్లాడుతూ కెసిఆర్ రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకున్నాడని ప్రపంచం తెలంగాణ వైపు చూచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఓడిపోయిందని రైతుబంధు జమ చేయడంలో ఘోరంగా ఓడిపోయిందని వివరించారు ప్రభుత్వం ఉద్యోగాలని పరిపాలన గొప్పలు చెప్పుకుంటుంది జనాలు పరిశీలిస్తున్నారని వచ్చే రోజులలో ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నా రు ఇప్పటికైనా ప్రభుత్వం పరిపాలనలో మార్పులు తెచ్చి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు .
ఈ కార్యక్రమంలో నాంపల్లి సింగిల్ విండోమాజీ చైర్మన్ నక్క చంద్రశేఖర్ పెద్దాపురం సింగిల్ విండో డైరెక్టర్ బెల్ది సత్తయ్య బిఆర్ఎస్ జిల్లా నాయకులు పోగుల వెంకటరెడ్డి ఇ, వెంకట్ రెడ్డి కుంభం చరణ్ రెడ్డి సప్పిడి శ్రీనివాస్ రెడ్డి నాంపల్లి మండల బి ఆర్ఎస్ నాయకులు గంజి సంజీవ గౌరు కిరణ్ ఆంజనేయులు బుడిగపాక గోవర్ధన్ తదితరులు పాల్గొని జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అనంతరం నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంచి కెసిఆర్ జ్ఞాపకాలు గుర్తు చేశారు