నగరంలో కీచక పర్వం
— నడిరోడ్డుపై యువతిని వివస్త్రను చేసిన వైనం
ప్రజా దీవెన/ మేడ్చల్: హైదరాబాద్ నగరం పరిధిలోని మేడ్చల్ జిల్లా
బాలాజినగర్ నగర్ నడిరోడ్డుపై కీచకపర్వం జరిగింది.
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ నడిబొడ్డున సుమారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అందరూ చూస్తుండగానే యువతిపై ఒక కీచకుడు అత్యంత దారుణానికి ఒడికట్టాడు.
షాపింగ్ కోసం రోడ్డుపై వెళ్తున్న గుర్తుతెలియని మహిళను పెద్దమారయ్య అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. తిరగబడిన మహిళను అతి దారుణంగా చితకబాది అందరూ చూస్తుండగానే ఒంటిపై బట్టలను చింపి వివస్త్రను చేశాడు.
ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన స్థానికులపై కూడా ఎదురుదాడి చేశాడు. ఈ తతంగమంతా తన కన్నతల్లి సమక్షంలో జరగడం, ఆ తల్లి తన కొడుకును సమర్ధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.స్థానికల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాధిత మహిళకు రక్షణ కల్పించారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.