–ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
Latif Saab Dargah : ప్రజా దీవెన, నల్లగొండ: కాంగ్రెస్ ప్రజాస్వామ్య సెక్యులర్ పార్టీ అని ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతావ త్ శంకర్ నాయక్ అన్నారు. మంగ ళవారం నల్గొండలోని మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యా లయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీ నివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అ బ్బగోని రమేష్ గౌడ్ లతో కలిసి ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమం కో సం పనిచేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం లో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయం గా అభివృద్ధి చేస్తూ ముందుకు పో తున్నామని తెలిపారు.
బిజెపి మతతత్వ పార్టీ అని మై నా ర్టీలపై దాడులు చేస్తూ ఓటు బ్యాం కు రాజకీయాలకు పాల్పడుతుంద ని విమర్శించారు. మతాల పేరుతో కులాల పేరుతో రెచ్చగొడుతుందని ఆరోపించారు. గత పది సంవత్స రాలుగా అధికారంలో ఉన్న బీఆ ర్ఎస్ పార్టీ పేద ప్రజలకు చేసింది ఏ మీ లేదని, ప్రజలు ఎవరు ఆ పార్టీని నమ్మడం లేదని ఎద్దేవా చేశారు.
నల్లగొండ పట్టణంలోని దర్గా ఘాట్ రోడ్డుపై రాజకీయాలు చేయవద్దని సూచించారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పట్టణాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చే యడం కోసం ఘాట్ రోడ్డుకు నిధు లు మంజూరు చేయించాడని పేర్కొ న్నారు. దీనిపై ఇతర పార్టీలు రాజకీ యం చేయడం సరైన విధానం కాద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ల అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా రాజకీయంగా తగిన ప్రా ధాన్యత కల్పించడం జరుగుతుం దని స్పష్టం చేశారు.అందులో భా గంగానే సీనియర్ కాంగ్రెస్ నేత అ యిన డాక్టర్ హఫీజ్ ఖాన్ కు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా అవ కాశం కల్పించడం జరిగిందన్నారు.
నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డిలు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంతో పా టు నియోజకవర్గాన్ని అన్ని విధాలు గా అభివృద్ధి చేస్తున్నాడని పేర్కొ న్నారు. గతంలో హైదరాబాదులో మత కల్లోహాలు జరిగితే నల్గొండలో కూడా జరిగేవని అన్నారు. కోమ టి రెడ్డి మంత్రిగా అయిన తర్వాత న ల్లగొండలో ప్రశాంత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. అన్ని వ ర్గాల ప్రజలు శాంతితంగా ఉంటు న్నారని తెలిపారు.
ఈమధ్య కొంతమంది మతం, కులం పేరుతో ప్రజల మధ్య గొడవలు పెట్ట డానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చారు. ఏ సమస్య ఉన్న సామర స్యంగా పరిష్కరించుకొని ముందు కు పోవాలన్నారు. ఇప్పటికైనా ఘా ట్ రోడ్డుపై అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచిం చారు.కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావా లు కలిగిన పార్టీ అని, అందుకే ము స్లిం మైనార్టీలంతా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నా రని తెలిపారు. ఈ విలేకరుల సమా వేశం అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నూతనంగా నియ మితులైన డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ ను శాలువా పూలమాలలతో ఘ నం గా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రత్యేక ఆహ్వానితులు మహమ్మద్ ఇంతి యాజ్ హుస్సేన్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మ య్య, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమద్, ఇంతి యాజ్ అలీ, ఆమేర్, ఇబ్రహీం, టీఎ స్ మేసా అధ్యక్షులు డాక్టర్ ఏఏ ఖా న్, అజ్జు, మహమ్మద్ షరీఫ్, బురా న్ షరీఫ్, హైమద్, ఎంఏ ఖయ్యూం బాబా, శ్రీనివాస్, భాస్కర్, కిన్నెర అంజి, పోలే జయకుమార్, గాలి నాగరాజు,గాలి రవి, పెరిక అంజ య్య తదితరులు పాల్గొన్నారు.