Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ketawat Shankar Naik : రేవంత్ రెడ్డిది ప్రజాపాలన..! కెసిఆర్ ది గడీల పాలన..!!

–అధికారంలో దోచుకొని ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు

–బిజెపి, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే

–డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్,పట్టణ అధ్యక్షుడుగుమ్మల

Ketawat Shankar Naik : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్ల గొండలోని రైతుధర్నా కార్యక్రమం లో కేటీఆర్ దగుల్బాజీ మాటలు మాట్లాడారని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ విమర్శిం చారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యా ప్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు బీఆ ర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పు డు ప్రజలకు ఇచ్చిన హామీలన్నిం టినీ విస్మరించిందని ధ్వజమెత్తారు. కెసిఆర్ గడీల పాలన సాగించాడని అన్నారు. ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వకుండా మోసం చేసిండని ఆరో పించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రా న్ని తండ్రి, కొడుకులు దోచుకున్నా రని విమర్శించారు.అధికారం కో ల్పోయిన తర్వాత పిచ్చి పట్టినట్లు గా మాట్లాడుతున్నారని అన్నారు.

 

 

గతంలో ప్రజలు, రైతుల సమస్యల కోసం ధర్నాలు చేస్తే ధర్నా చౌకాను ఎత్తివేసింది నిజం కాదా అని ప్రశ్నిం చారు. 10 సంవత్సరాల కాలంలో అన్ని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశా రని, దోచుకున్నారని విమర్శించా రు. దయ్యాలు వేదాలు వల్లించిన ట్లుగా కేటీఆర్ నల్లగొండకు వచ్చి ప్రగల్బాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య కోసం పోరాటం చేశాడని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశా డని అన్నారు. మంత్రులను విమ ర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందని అన్నారు. ఇటీవల గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు జగదీశ్ రెడ్డి జిల్లా అభివృద్ధికి చేసిం ది ఏమీ లేదని అన్నారు.బయటకు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ బీఆ ర్ఎస్-బిజెపి పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు.ఇకనైనా కేటీఆర్ ప్రభు త్వాన్ని విమర్శించడం మానుకోవా లని, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

 

 

నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్ల గొండలో కేటీఆర్ రైతుధర్నా ఒక డ్రా మా అని అభివర్ణించారు. నల్లగొండ గడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా అని స్పష్టం చేశారు.అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా అధి కారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలకు సమస్యలు గుర్తుకొ స్తున్నాయని ధ్వజమెత్తారు.కెసిఆర్ దేవరకొండకు వచ్చినప్పుడు సొరం గం మార్గాన్ని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని, డిండి ప్రాజెక్టును పూర్తి చేసి దేవరకొండను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా శివన్న గూడెం ప్రాజెక్టును పూర్తి చేసి ఫ్లోరై డ్ రక్కసి నుంచి విముక్తి చేస్తానని , నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో నెల్లికల్ ఎత్తిపోతల పథకం హామీ ఇచ్చి మోసం చేసిరని విమర్శిం చారు.తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల 10 వేల ఎకరాలకు 11 విడ తలు ప్లాట్లకు, గుట్టలకు రైతుబం ధు ఇచ్చారని తెలిపారు. గ్రామా లలో పేదలందరికీ ఇండ్లు ఇస్తానని చెప్పి కెసిఆర్ మోసం చేసిందని అన్నారు. అధికారంలో ఉన్నప్పు డు ఇచ్చిన హామీలన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాలకు సబ్ స్టేషన్లు, గ్రామాలకు కోట్లాది నిధులతో రోడ్లు, నల్గొండ పట్టణంలో ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశా డని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చే స్తుంటే కేటీఆర్ సిగ్గు లేకుండా విమ ర్శలు చేస్తున్నాడని అన్నారు. ప్రజా నాయకుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నల్ల గొండ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని స్పష్టం చేశారు.నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్* మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నల్ల గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇక్కడి ప్రజలను నిలువునా మోసం చేశా డని విమర్శించారు. నల్లగొండలో రైతు మహా ధర్నా పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారని ఆరోపిం చారు. నల్లగొండలో బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు శిలాఫతకాలకే పరిమితమయ్యాయి తప్ప అమ లు చేసిన దాఖలాలు లేవన్నారు.

 

అధికారంలో ఉన్నప్పుడు దొరల పాలన సాగించిన కెసిఆర్ ,కేటీఆర్ మాటలను ప్రజలు ఇప్పుడు ఎవ రు నమ్మడం లేదని అన్నారు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైవే రోడ్ల విస్తరణతో పాటు నల్గొం డ జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తు న్నాడని తెలిపా రు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయ కులు జూలకంటి శ్రీనివాస్, ఇబ్ర హీం, జూలకంటి సైదిరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, కత్తుల కోటి,వజ్జ రమేష్ యాదవ్, కిన్నెర అంజి , గురిజ వెంకన్న, జానీ యాదవ్, కంచర్లకుంట్ల వెంకటరెడ్డి, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, పెరిక హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.