Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..!?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారు తుంది. ఈ కేసులో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

మునుగోడు ఎన్నికల్లో నగదు తర లింపు వెనక ఐపీఎస్ అధికారి
కానిస్టేబుల్ వాగ్మూలం లో విస్తు పోయే విషయాలు వెలుగులోకి

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం(phone tapping case) చిలికి చిలికి గాలివానలా మారు తుంది. ఈ కేసులో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయం లో ఓ ఐపీఎస్‌ అధికారితోపాటు పాటు ఓ డీఎస్పీ బీఆర్ఎస్‌కు(BRS) సహ కారం అందించినట్టు దర్యాప్తులో వెలుగుచూసింది. అంతేకాదు, తెర వెనుక మరికొందరు అత్యు న్నత స్థాయి పోలీసులు ఉన్నట్టు సమా చారం. వారి మౌఖిక ఆదే శాలతో ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని బృందం నగదు సర ఫరాను పర్య వేక్షించిట్టు తెలిసింది. దర్యాప్తులో మున్ముందు సహకారం అందించిన అత్యున్నతస్థాయి అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు విశ్వస నీయవర్గాల ద్వారా అందిన సమా చారం.

మునుగోడు ఉప ఎన్నికలో(munugode by election) బీఆర్ఎస్ అభ్యర్థి (BRS Candidate)కోసం నిబంధన లకు విరుద్ధంగా డబ్బు సరఫరా చే సేందుకు ఫార్చునర్ వాహనాన్ని వినియోగించారు. ఆ వాహనానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించిన కాని స్టేబుల్ వాంగ్మూలం ఆధారంగా ఈ విషయం వెలుగుచూసింది. ఐపీఎస్ అధికారితోపాటు స్పెషల్ బ్రాంచ్ వ్యవహారాలను పర్యవేక్షించిన డీ ఎస్పీ ఆదేశాలతోనే తాను ఆ వాహ నానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించి నట్టు నల్గొండకు చెందిన ఆ కాని స్టేబుల్ తన వాంగ్మూలంలో పేర్కొ న్నాడు. అంతేకాదు, అప్పుడేం జరి గిందన్న విషయాన్ని పూర్తిగా వివ రించాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు(Constable) కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిం చారు.

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తాను నల్గొండ టాస్క్‌ ఫోర్స్‌లో (Nalgonda task force)పనిచేశానని, ఐపీఎస్ అధి కారి ఆదేశాల మేరకు డీఎస్పీ తన ను తీసుకెళ్లారని ఆ కానిస్టేబుల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. నవంబరు 1న తప్ప 2022 అక్టోబరు 26 నుంచి నవంబర్ 2 వరకు ప్రతి రాత్రి ఫార్చునర్ వాహ నానికి ఎస్కార్ట్‌గా వ్యవహ రించిన ట్టు వివరించాడు. ఆ వాహనంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి డబ్బును తరలిం చారని తెలిపాడు. అక్టోబర్ 31న జరిగి న బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి పాల్గొన్నారని, ఆ సభలోనే తమ డీఎస్పీ ఓ ఐపీఎస్ అధికారిని చూపించి, కేసీఆర్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారని, ఆయన ఆదేశాల మేరకు డబ్బును సరఫరా చేస్తున్నట్టు వివరించారని పేర్కొ న్నారు. ఆ తర్వాతే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఆ అధికారి నాయి ని భుజంగరావు అని తనకు తెలి సిందని ఆ కానిస్టేబుల్ తన వాం గ్మూలంలో పూసగుచ్చినట్టు స్పష్టం చేసినట్లు తెలియ వచ్చింది.

Key turning point in phone tapping case