Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Khammam Crime : ప్రియురాలి కోసం కుటుంబాన్నే కడతేర్చాడు

–కనికరం డాక్టర్ చేతిలో భార్య, ఇద్దరు పిల్లల దారుణహత్య
–విషపు ఇంజెక్షన్‌తో భార్య, ఊపి రాడకుండా చేసి కుమార్తెల హత్య
–కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
–నలభై ఎనిమిది రోజుల తర్వాత వీడిన మిస్టరీ, వైద్యుడు అరెస్టు

Khammam Crime : ప్రజా దీవెన, ఖమ్మం: కట్టుకున్న భర్త, కన్న తండ్రి అయిన ఓ ప్రబు ద్ధుడు ఆ కుటుంబం పాలిట కాల యముడయ్యాడు. తనకొచ్చిన జ్వరం (fever) నయమయ్యేం దుకు ఇంజెక్షన్‌ చేస్తానంటే అతడిని ఆమె ఎలా అనుమానిస్తుంది భార్యను చంపేం దుకు ఎప్పుడో పథకం వేసి, అవకా శం కోసం ఎదురుచూస్తున్న ఆ భర్త విషపు ఇంజెక్షన్‌ను (Venom injection)ఇచ్చి ఆమె ప్రాణలు బలిగొన్నాడు. తర్వాత తనకన్నబిడ్డలిద్దరినీ ముక్కూ నోరు మూసి చంపేశాడు. ఆపై రోడ్డు ప్రమాదం (road accident) జరిగినట్టు, ఆ ప్రమా దంలోనే భార్యాపిల్లలు చని పోయినట్లు సీన్‌ క్రియేట్‌ చేశాడు. అయితే ఘటన జరిగిన 48 రోజుల తర్వాత అతడి దుర్మార్గం బట్టబ యలైంది. మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వైద్యుడు, తన ఆ ఆనందానికి భార్యాబిడ్డలు అడ్డుగా ఉన్నారని భావించి ఈ ఘోరానికి పాల్ప డినట్లు పోలీసులు నిర్ధారించారు.

దీంతో ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలంలో రోడ్డు ప్రమాదం–ముగ్గురి మరణం ఘటన వెనుక మిస్టరీ వీడింది. ఖమ్మం ఏసీపీ రమణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఏన్కూ రు మండలం రామ్‌నగర్‌కు చెందిన కుమారి(28)కి రఘునా థపాలెం మండలం బావోజీ తండాకు చెందిన డాక్టర్‌ బోడా ప్రవీ ణ్‌తో 2019లో వివాహం జరిగింది. ప్రవీణ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అనస్థిషియా వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ప్రవీణ్‌–కుమారి దంపతులకు కూతుళ్లు కృషిక(5), కృతిక (3) ఉన్నారు. కుటుంబంతో కలిసి ప్రవీణ్‌ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. వృత్తిలో భాగంగా ఆస్పత్రిలో(hospital) రాత్రిపూట విధు లు నిర్వహించే ప్రవీణ్‌కు అక్కడే పనిచేస్తున్న కేరళకు చెందిన సోనీ ఫ్రాన్సీస్‌ అనే యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి భార్య కుమారికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీలు (Heads of families are Panchayats) నిర్వహించి భార్యాభర్తలకు నచ్చజెప్పారు. ఈ గొడవలు సోనీకి చికాకు తెప్పించాయి. భార్యాపిల్లలను అడ్డుతొలగించుకుంటే ఇద్దరం కలిసి ప్రశాంతంగా ఉండొచ్చంటూ ఆమె ప్రవీణ్‌కు చెప్పింది. దీనికి ప్రవీణ్‌ అభ్యంతరం చెప్పకపోగా భార్య,పిల్లల హత్యకు పథకం వేశాడు. సొంతూర్లో ఇంటి వద్ద పనులున్నాయని చెప్పి.. మే నెలలో పది రోజులు ప్రవీణ్‌ సెలవు పెట్టి భార్యాపిల్లలను వెంటబెట్టుకొని బావోజీ తండాకు వచ్చాడు.

అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్‌ (Anesthetic injection)ఇస్తే ఎన్ని గంటల్లో చనిపోతారనే విషయమ్మీద అప్పటికే గూగుల్లో వెతికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. మే 26న కుమారి ఇంజెక్షన్‌ చేయడానికి విఫలయత్నం చేశాడు. రెండ్రోజుల తర్వాత ఆధార్‌ కార్డులను ఆప్‌డేట్‌ చేయాలంటూ భార్యాపిల్లలను వెంటబెట్టుకొని కారులో ఖమ్మానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కుమారి.. అనారోగ్యంగా ఉందనడంతో బల్లేపల్లి సెంటర్‌లోని ఓ మెడికల్‌ షాపులో (medical shop) క్యాల్షియం ఇంజెక్షన్‌తో పాటు మరో ఇంజెక్షన్‌నూ కొనుగోలు చేశాడు. ఓ 3 కి.మీ దూరం వెళ్లాక కోయచెలక సమీపంలో కారు ఆపాడు. భార్యను వెనుక సీట్లో పడుకోబెట్టి రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. వెంటనే కుమారి స్పృహ కోల్పోయింది. తర్వాత.. ఒకరు తర్వాత మరొకరుగా ఇద్దరు చిన్నారులను ముక్కు, నోరు మూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కుమారి కూడా చనిపోయిందని నిర్ధారించుకొని మృతదేహాలతో కారులో బయలుదేరాడు. సొంతూరు వెళ్లే దారిలో మంచుకొండ అనే ప్రాంతం వద్ద కారు ఎడమవైపు దెబ్బతినేలా పథకం ప్రకారం రోడ్డు పక్కన చెట్టుకు బలంగా ఢీకొట్టాడ
ప్రియురాలు చెప్పిందని..

కారులో దొరికిన ఖాళీ సిరంజ్‌ (Empty syringe) ఆధారంగా …ప్రవీణ్‌ స్వల్పగాయాలతో బయటపడటం, ఏ చిన్నగాయం కూడా కాకున్నా కుమారి, ఇద్దరు పిల్లలు చనిపోవడం.. ఆమె తరఫువారిలో తీవ్ర అనుమానాలు రేకెత్తించింది. ఫలితంగా ఘటన మరుసటి రోజే కుమారి తరఫు బంధువులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. తమ కూతురు, మనుమరాళ్ల మృతి విషయంలో అనుమానాలున్నాయని కుమారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కారులో ఖాళీ సిరంజి దొరికింది. కుమారి మృతదేహం చేతికి చిన్న చిన్న మచ్చలు ఉండటంతో అవి ఇంజెక్షన్లకు సంబంధించినవి కావొచ్చునని అనుమానంతో ఫోరెన్సిక్‌ నిపుణులకు సిఫారసు చేయగా వారొచ్చి నమూనాలు స్వీకరించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ (Postmortem, Forensic Lab) నివేదిక ఆధారంగా ముగ్గురిది హత్య అని తేలింది. ప్రవీణ్‌ను పోలీసులు విచారణ చేయగా నేరాన్ని అంగీకరించాడు. అతడి ప్రియురాలు సోనీపైనా కేసు నమోదు చేశారు.