Kidnapping : ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్రoలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ బాలుని కిడ్నాప్ కలకలం సృష్టించింది. మూడేండ్ల బాలుడు కిడ్నాప్ కావడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసిం ది. హాస్పిటల్ ఆవరణలో ఆడుకుం టున్న అబు అనే మూడేండ్ల బాబు ను గుర్తు తెలియని వ్యక్తి అపహ రించినట్లు ఆనవాళ్లు దొరికాయి. బాలుడు కనిపించకపోవడంతో దవాఖాన ఆవరణలో వెతికిన బా లుడి తల్లిదండ్రులు ఆచూకీ లభిం చలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్ర యించారు. దీంతో కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.బాలుడిని ఒక వ్యక్తి మాయమాటలు చెబుతూ ఫోన్లో మాట్లాడిస్తూ తీసుకెళ్తున్నట్టుగా హాస్పిటల్ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు రికార్డుల్లో నమోదైంది. హాస్పిటల్ నుంచి బాలుడిని రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్లినట్టు గుర్తిం చారు.
అయితే సీసీ కెమెరాల్లో దుం డగుడు అక్కడికి వచ్చినట్టుగా ఎ క్కడా కనబడలేదు. దీంతో బస్టాం డ్ ఆవరణలో వెతికినా కూడా ఎ క్కడ కూడా సీసీ కెమెరాల్లో బాలు డిని తీసుకెళ్తున్న ఫుటేజ్ లభ్యం కాలేదు. దీంతో బాలుడిని నల్లగొం డ పట్టణంలోనే ఎక్కడో చోట దాచి నట్లుగా పోలీసులు అనుమానిస్తు న్నారు. ఈనేపథ్యం లో నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు దుండగుడి కోసం గాలి స్తున్నారు. కాగా, గత మూడేండ్లుగా బాధిత కుటుంబం శహమున్నిసాబేగం, అ హ్మద్ దంపతులు తమ కొడుకు అబూ తో కలిసి ప్రభుత్వ ఆసు పత్రిలో నే జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తుంది.
Child kidnap in nalgonda government hospital pic.twitter.com/zaDlrF1kKb
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) March 6, 2025