–ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Kiran Kumar Reddy : ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలి గౌరారం మండలం ఉప్పలంచ మా జీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారు మల్లయ్య అకాల మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని భువనగిరి పార్లమెం ట్ సభ్యులు చామల కిరణ్ కుమా ర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సా యంత్రం ఉప్పలంచలో హత్య కు గురైన మాజీ సర్పంచ్ బండారు మల్లయ్య నివాసానికి కిరణ్ కుమా ర్ రెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మల్లయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివా ళులు అర్పించారు.పార్టీ పరంగా తాము అన్ని విధాలుగా ఆధుకుం టామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
మల్లయ్య హంతకులను కఠి నంగా శిక్షించేందుకు పోలీస్ అధి కారులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూక కిరణ్ కుమార్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ నరిగే నర్సింహా,నాయకులు షేక్ ఇంతియాజ్ అహ్మద్ గూని వెంకటయ్య,చింత ధనుంజయ,వడ్లకొండ పరమేష్,చౌడే మహేందర్,వేముల గోపినాథ్, బొల్లికొండ గణేష్, బొమ్మగాని రవి,గంట్ల వేణుగోపాల్ రెడ్డి, నూక కిషోర్ యాదవ్,బోడ అరుణ్ కుమార్,బండారు సాలయ్య తదితరులు పాల్గొన్నారు.