–రేవంత్ విదేశీ పర్యటనపై బురద జల్లే ప్రయత్నం
–బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
–భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి
Kiran Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)పర్యటన కొనసాగుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) తెలి పారు. అమెరికా పర్యటన ముగిసి దక్షిణ కొరియాకు సీఎం రేవంత్ బృం దం వెళ్లిందని చెప్పారు. ఇప్పటి వరకు రూ.31,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయని అన్నారు. ఐటీ, ఫార్మా, ఏఐ కంపెనీలతోపాటు మరికొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి అoగీకరించాయని చెప్పారు. 8 నెలల్లో రెండు సార్లు విదేశీ పర్య టనలు జరిగాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు.గత బీఆర్ ఎస్ హయాంలో చేసిన అప్పులు అందరికీ తెలుసునని చెప్పారు. చెప్పినట్టుగా సీఎం రేవంత్ రైతు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తు న్నారని మండిపడ్డారు. రేవంత్ విదే శీ పర్యటనపై కూడా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించా రు.
తాము తప్పులు చేస్తే నిలదీ యండి కానీ బురద జల్లవద్దని హిత వు పలికారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పదేళ్లు కుటుంబ పాలన సాగిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు.వారే అన్ని పదవులు పొందారని అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనని తెలిపారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాను పెంచి పోషిస్తు న్నారని విమర్శలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ బంధువులైన తెలం గాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే స్వాగతిస్తామని అన్నారు. తప్పుడు ప్రచారాలను మానుకోవా లని సూచించారు. పదేళ్లు చేయని ది 8 నెలల్లోనే చేయాలని ప్రశ్నించా రు. కొంత సమయం ఇస్తే అన్ని పూర్తి చేస్తామని వివరించారు. కాళేశ్వరం, సుంకిశాల (Kaleswaram, Sunkishala) కూలడానికి తామే కార ణం కాదని సుంకిశాల తప్పిదం బీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా 8 మంది ఉన్నామని అందరం కలిసి కేంద్రం నుంచి తెలంగాణకు అభివృ ద్ధి కోసం నిధులను తెచ్చుకుం దామని చామల కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) కోరారు.