Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishan Reddy:మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం

–వారికి ఏకంగా 30 శాతం నిధుల పెంపా
— కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

Kishan Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్‌: అభూ తకల్పన, అంకెల గారడి, ఆర్భా టం, సంతుష్టీకరణ తప్ప రాష్ట్ర బడ్జెట్‌లో (State budget) ఏమీ లేదని కేంద్ర బొగ్గు ,గనులశాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి (Kishan Reddy) ఓ ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఎన్నికల ముం దు ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కిందని, ప్రతి సంవత్సరం రైతు లకు సీజన్‌ ముందు ఇవ్వాల్సిన పంటపెట్టుబడి సాయానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని ఆరో పించారు. ‘ఆసరా పెన్షన్‌ల (Supportive Pension)ప్రస్తావనే లేదు. పెన్షన్లు పెంచుతామని మో సం చేశారు. మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చా రని, కానీ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. దళితులు, గిరిజ నుల సంక్షేమం కోసం కేటాయిం పులు తగ్గిపోయాయి. మొత్తం ప్రపంచం ఏమైపోయినా ఫరవా లేదు, మైనారిటీల సంతుష్టీకరణ మాత్రమే చాలనే కాంగ్రెస్‌ ఆలోచన మరోసారి ఈ బడ్జెట్ (budget) లో బట్టబ యలైంది. 2023–24లో రూ.2వేల కోట్లుగా ఉన్న మైనార్టీ సంక్షేమ నిధులను ఏకంగా రూ.3, 003కోట్ల కు పెంచారు. అంటే ఒక్క ఏడా దిలోనే 30 శాతం పెంచేశారు’ అని ఆరోపించారు. గత సర్కారు విచ్చల విడిగా చేసిన అప్పులు కట్టేందుకు, ఆరు గ్యారంటీలను (Six guarantees) అమలు చేేసం దుకు మరిన్ని అప్పులు చేస్తున్నా రని విమర్శించారు.