* ప్రతి విద్యార్థినికి ఉద్యోగం ఉపాధి కల్పించడమే కళాశాల ధ్యేయం
* ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏకైక మహిళ ఇంజనీరింగ్ కళాశాల గా కిట్స్ కు గుర్తింపు
KITS College: ప్రజా దీవెన, కోదాడ: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న నాణ్యమైన సాంకేతిక విద్యను అందించటమే కోదాడ (Kodad) కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల (KITS Women’s Engineering College) లక్ష్యమని కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ (Dr. Neela Satyanarayana) అన్నారు. శుక్రవారం కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సర విద్యార్థుల(first-year BTech students)కు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులు ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఉపాధి కల్పించే విధంగా విద్యను అందించడమే కళాశాల ధ్యేయమన్నారు.
కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లాలోని మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల అని రెండు దశాబ్దాల నుండి వందలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకుని నేడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. అలాగే కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున రావు (Nagarjuna Rao) మాట్లాడుతూ.. కళాశాలలోని వసతులను వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి గాంధీ (Dr. P. Gandhi) మాట్లాడుతూ.. కళాశాలలో చదువులతోపాటు కరికులం కోకరికులం అంశాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో అర్హత కలిగిన విద్యార్థులతో పాటు ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీ వంటి సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు
కళాశాల పూర్వ విద్యార్థిని మర్రి వెంకట రమణ, ప్రభుత్వ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ మరియు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ లో ఉన్నతాధికారిగా ఎంపిక అయిన సందర్బంగా కళాశాల చైర్మన్ అభినందనలు తెలిపి ఘనంగా సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో కృష్ణారావు,హెచ్ ఓడీ లు ఎన్ రమేష్,నరేష్ రెడ్డి, స్రవంతి, జనార్ధన్, ఎజాజ్అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.