మంచి పరిపాలనతో ప్రజలకు విశేష సేవలు అందించారు.
ప్రజా దీవెన, కోదాడ : కోదాడ మండల పరిధిలో ఉన్న గ్రామాల అభివృద్ధిలో ఎంపీపీ, ఎంపీటీసీలు (mpp,mptc)చేసిన కృషి మరువలేనిదని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి (Venepall y)చందర్ రావు అన్నారు. బుధవారం కోదాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలకు (mptc)ఏర్పాటు చేసిన వీడ్కోలు అభినందన సన్మాన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
గడిచిన గత ఐదు సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కొరకు నిత్యం పనిచేశారని మంచి పరిపాలన అందించి ప్రజల మనసులు గెలిచారని ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఎంపీపీ మల్లెల. రాణి, జడ్పిటిసి మందలపు.
కృష్ణకుమారి తో పాటు ఎంపీటీసీలను శాలువా, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ (Municipal Chairman) సామినేని. ప్రమీల, పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు. పాండురంగారావు, పట్టణ అధ్యక్షులు వంగవీటి. రామారావు, అల్తాఫ్ హుస్సేన్,వరప్రసాద్ రెడ్డి, ఓరుగంటి. శ్రీనివాస్ రెడ్డి,ఎంపీడీవో రామచంద్ర రావు, వైసీ ఎంపీపీ లిక్కి. గురవమ్మ,ఎంపీటీసీలు శెట్టి.కోటేశ్వరరావు, సింగారెడ్డి. హిమ బిందు, సుమన్ రెడ్డి, యారమల. క్రాంత్ కుమార్, చలసాని.శ్రీలత, సౌజన్య నాయకులు ఇర్ల సీతారాం రెడ్డి,అమరనాయని వెంకటే శ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Kodada mptc