Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kodi Srinivas: తెలంగాణ సాధనకు పట్టుకొమ్మ బతుకమ్మ పండుగ

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు

Kodi Srinivas: మునుగోడు ప్రజా దీవెన అక్టోబర్ 2 :తెలంగాణ సాధనకు పట్టుకొమ్మగా బతుకమ్మ పండుగ (Bathukamma festival) నిలిచిందని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు (Kodi Srinivas)అన్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం (Gandhiji English medium)స్కూల్లో మంగళవారం రోజున బతుకమ్మ వేడుకలను ఆటపాటలతో బతుకమ్మలను అలంకరించుకొని ఘనంగా వేడుకలను జరుపుకున్నారు పాఠశాల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధించే పెద్ద పండుగని తెలంగాణ రాష్ట్రం(Telangana State)లోని సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రపంచ దేశాల తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు పూలు బాగా వికసించే కాలంలో జల వనరులు సమృద్ధిగా పొంగే వర్షాకాలం చివరలో వస్తుందని అన్నారు. ఈ పూల పండగ ఎంగిలిపువ్వు బతుకమ్మ పండుగ తో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న ,కర్నాటి నాగరాజు ,ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రవీందర్,రామేశ్వరి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు